Share News

గ్రూపులను సహించం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:43 AM

తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలను సహించేది లేదని మంత్రి కొలుసు పార్థసారథి శ్రేణులను హెచ్చరించారు.

గ్రూపులను సహించం
కార్యకర్తలను మందలిస్తున్న మంత్రి పార్థసారథి

వినకపోతే వెనక్కిపోతారు

టీడీపీ శ్రేణులకు మంత్రి కొలుసు హెచ్చరిక

నూజివీడు, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలను సహించేది లేదని మంత్రి కొలుసు పార్థసారథి శ్రేణులను హెచ్చరించారు. రెండు గ్రూపులతో చర్చించి వివాదాలకు చెక్‌ పెట్టాలని మంత్రి భావించారు. చాట్రాయి మండలం పోలవరంలో మంగళ వారం రెండు వర్గాలను మంత్రి పిలిచారు. వారు ఒకే వేదికపైకి రాకపోవడంతో మంత్రి విడివిడిగా చర్చించి హెచ్చరికలు చేశారు. అధిష్ఠానం నిర్ణయాలను అతిక్ర మించి గ్రూపు రాజకీయాలు చేస్తే వారిపై చర్యలు తప్ప వని, వినకపోతే వెనక్కిపోతారని స్పష్టం చేశారు. నియో జకవర్గంలో కాంట్రాక్ట్‌లు, మట్టి తోలకం వ్యవహారాలు పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రస్తావించారు.

స్థానిక నాయకత్వం మార్పులు?

తెలుగుదేశం మహానాడుకు ముందే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగవలసి ఉంది. నియోజకవర్గంలో విభేదా లు సమసిపోవాలంటే గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ నాయకత్వం మార్పు చేయాలని మంత్రి సారథి భావి స్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం వేదికగా ఇరువర్గాలకు హెచ్చరికలు చేశారు. గ్రూపులతో పార్టీకి నష్టం జరిగితే సహించేది లేదని, అవసరమైతే మూడో వ్యక్తిని తీసుకువస్తానని చెప్పడం ద్వారా మంత్రి పార్టీ క్యాడర్‌కు గట్టి హెచ్చరిక జారీచేశారు. వార్డు నుంచి మండల స్థాయి పదవుల వరకు ఎవరెవరిని కొనసాగించాలి, ఎక్కడ కొత్తవారిని తేవాలనే విషయంపై మంత్రి నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

మట్టి తగవుపై మండిపడిన మంత్రి

పోలవరంలో పలువురు కార్యకర్తలు మట్టి తోలకాలు మంత్రి దృష్టికి తెచ్చారు. అధికారులు దాడులు చేస్తు న్నారని తెలిపారు. మట్టి రవాణాపై కార్యకర్తలను మంత్రి మందలించారు. గ్రామాల్లో నివాస స్థలాలకు మట్టి తోలుకోడానికి అవకాశం ఇస్తే కొంతమంది దానికి భిన్నంగా వ్యవహరించారన్నారు. అధికారులకు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. తనకు చెప్పింది ఒకటి, కొందరు చేస్తోంది మరొకటి అంటూ మంత్రి కార్యకర్తలకు చివాట్లు పెట్టారు.

Updated Date - Apr 30 , 2025 | 12:43 AM