త్వరలోనే ఖాళీ పోస్టుల భర్తీ
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:12 AM
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో త్వరలోనే వైద్య సిబ్బంది నియామకాలు భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా లేదా సీఎస్‌ఆర్ ద్వారా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యా లను సమకూర్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపా రు.
మంత్రి పార్థసారథి .. మెడికల్ కళాశాల నిర్మాణ భవనాల పరిశీలన
ఏలూరు క్రైం, సెప్టెంబరు 8(ఆంధ్ర జ్యోతి):ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో త్వరలోనే వైద్య సిబ్బంది నియామకాలు భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా లేదా సీఎస్‌ఆర్ ద్వారా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యా లను సమకూర్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపా రు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను సోమవారం మంత్రి పరిశీలిం చారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అవసరమైన భవనాలు, వైద్య చికిత్స పరి కరాల వివరాలను వైద్య శాఖ అధికారుల నుంచి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో కొన్ని భవనాలను వైద్య కళాశాలకు వినియోగిస్తున్నారని, రెండు, మూడు నెలల్లో వైద్య కళాశాల భవనాలు పూర్తయితే అవి కూడా యఽథా విధిగా తిరిగి ఆస్పత్రి వినియోగంలోకి వస్తాయన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సావిత్రి, సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఉన్నారు.