Share News

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసింది జగనే

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:33 AM

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసి జగన్‌ మోసం చేశారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి ఐదువేల కోట్ల రూపాయలను మళ్లించారని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు.

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసింది జగనే
పాలకొల్లులో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి రామానాయుడు

పాలకొల్లులో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు టౌన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసి జగన్‌ మోసం చేశారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి ఐదువేల కోట్ల రూపాయలను మళ్లించారని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో కోట్లాది రూపాయలతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి కూటమి నాయ కులు, అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవనం, గౌడ, శెట్టిబలిజ భవనం, ముస్లిం షాదీఖానా, టిడ్కో గృహాలు, కాలువపై బ్రిడ్జి, ప్రభుత్వ ఆసుపత్రి భవనం, పార్కులు, ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. టిడ్కో గృహాల పనులు వేగవంతంగా జరుగు తున్నాయని, పూర్తవగానే మిగిలిన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అంబేడ్కర్‌ భవనం, గౌడ, శెట్టిబలిజ భవనం, ముస్లిం షాదీఖానా అభివృద్ధి పనులవైపు గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు కన్నెత్తి చూడలేదన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులన్నింటినీ పూర్తిచేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, ఆర్డీవో దాసి రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ విజయసారధి, ఎన్టీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 12:33 AM