Share News

పర్యావరణం పరిరక్షిద్దాం

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:53 AM

భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలని, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

పర్యావరణం పరిరక్షిద్దాం
పట్టిసీమలో గోదావరి ఒడ్డున మొక్కలు నాటిన కలెక్టర్‌ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బాలరాజు

నూజివీడు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలని, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినం సందర్భంగా బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలను నాటా రు. జిల్లాలో గురువారం ఒక్కరోజే పెద్ద ఎత్తున 4.5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్‌ వినియో గాన్ని తగ్గించి క్లాత్‌ బ్యాగ్‌లు వినియోగాన్ని పెంచాలన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సమయాలలో మొక్కలు నాటాలని సూచించా రు. ప్రజలతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అటవీ శాఖ అధికారి శుభమ్‌, సబ్‌ కలెక్టర్‌ బి.స్మరణ్‌రాజ్‌ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన కలెక్టర్‌

ఏలూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): వనం మనం కార్యక్రమంలో భాగంగా పట్టిసీమలో గోదావరి ఒడ్డున కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌, జేసీ పి.ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొక్కలు నాటారు. మొక్కలు నాటుదాం– పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Jun 06 , 2025 | 12:53 AM