ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:50 PM
ప్రతిష్టా త్మకంగా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి అన్నారు.

ఆచంట, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టా త్మకంగా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి అన్నారు. ఆదివారం ఆచంట ఆచంటేశ్వ రుని స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల యానికి వచ్చిన మంత్రిని అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందిం చారు. దర్శనం అనంతరం గొడవర్తి శ్రీరాములు గంధర్వ మహల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఇంకా చేరువ య్యేలా మంచి జరగాలని ఆచంటేశ్వరుని కోరుకున్నానన్నారు. గోదావరి పుష్కరాలకు ముందే అఖండ గోదావరి ప్రాజెక్టును నెలకొల్పుతామని, సీఎం ఆధ్వర్యంలో ప్రణాళికలు చేపడుతున్నట్టు తెలిపారు. అంతిర్వేదిలో ఉన్న రథకం కాలి పోయినా ఘటనపై శాసన మండలిలో తాను చర్చించడం బాధ కలిగిచిందన్నారు. సోమవారం అంతిర్వేది పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తానన్నారు. దేవాలయాల అభివృద్ధికి, భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే విధంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆచంటలో పురాతనమైన ముత్యాలమ్మ ఆలయ పునఃనిర్మాణానికి సంబం ధిత అధికారులను పంపించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. గొడవర్తి శ్రీరాములు, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, అధికారులు, ఈవో ఎ.వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.