Share News

ప్రతి రైతును ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:54 AM

‘జిల్లాలో మొంథా తుఫాన్‌ నేపథ్యంలో 90 పునరావాస కేంద్రాలకు 3,422 మంది తరలించి సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు వల్ల తుఫాన్‌ను సమర్థ వంతంగా ఎదుర్కొన్నాం. విపత్తు నివారణకు యంత్రాంగం మనస్సు పెట్టి చేసింది’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ప్రతి రైతును ఆదుకుంటాం
ఏపూరులో బాధితులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యేలు చింతమనేని, పత్సమట్ల, కలెక్టర్‌ వెట్రిసెల్వి తదితరులు

3,422 మందిని పునరావాసానికి తరలించాం

నేటిలోగా నష్టాలపై నివేదిక ఇవ్వండి : ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మనోహర్‌

ఏలూరు/పెదపాడు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి):‘జిల్లాలో మొంథా తుఫాన్‌ నేపథ్యంలో 90 పునరావాస కేంద్రాలకు 3,422 మంది తరలించి సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు వల్ల తుఫాన్‌ను సమర్థ వంతంగా ఎదుర్కొన్నాం. విపత్తు నివారణకు యంత్రాంగం మనస్సు పెట్టి చేసింది’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఏలూరు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై బుధవా రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 408 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. తుఫాన్‌ బాధితులు సహాయ కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనె, రెండు రకాల కూరగాయలు కిలో చొప్పున అందిస్తామన్నారు. చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు అదనంగా 25 కేజీల బియ్యం అందిస్తామన్నారు.

నష్టాలపై నివేదిక అందించండి..

జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థకశాఖ, ఆక్వా రంగానికి కలిగిన నష్టాలపై ఈనెల 30 తేదీలోగా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆర్టీసీ చైర్మన్‌ రీజనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, డీఆర్‌వో వి.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

ఏపూరు పునరావాస కేంద్రం సందర్శన..

పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో రేకులషెడ్లు, పూరిపాకల్లో నివసిస్తున్న 32 కుటుంబాలకు చెందిన 96 మందిని పునరావాస కేంద్రానికి తరలించి వసతి, భోజన ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే కుటుంబాలకు 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు, బాధిత మనిషికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.3 వేలు చొప్పున నగదు పరిహారాన్ని అందజేశారు. ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, డీఎస్‌వో ఈబీ విలియ మ్స్‌, జిల్లా వ్యవసాయశాఖ జేడీ షేక్‌ హాబీబ్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.

రైతులందరిని ఆదుకుంటాం

తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని ఇన్‌చార్జి మంత్రి మనోహర్‌ తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన పంటలను పెదపాడు మండలం వట్లూరులో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు వరిదుబ్బులను చూపించి, తమ బాధలను వ్యక్తం చేసి ఆదుకోవాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

అధికారులతో మంత్రి మనోహర్‌ సమీక్ష

ఏలూరు సిటీ : ఏలూరు జిల్లాలో నిర్వహించిన తుఫాన్‌ సహాయక కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, తుఫాను సహాయక కార్యక్రమాల జిల్లా ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే, జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వితో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని, వీటిని అధికారులు పరి ష్కరిం చడంతో నష్టాన్ని నివారించగలిగామన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలతో నష్టాల ను తగ్గించగలిగామని అధికారులను అభినందించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తుఫాన్‌ ప్రత్యేకాధికారులు అందించిన సూచనలతో తుఫాన్‌కు ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టం సంభవించలేదన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:54 AM