Share News

ఇంకెన్ని ఇచ్చారో..?

ABN , Publish Date - May 24 , 2025 | 12:52 AM

దర్భరేవు కంపెనీ భూముల రిజిస్ర్టేషన్లలో చోటు చేసుకున్న అవినీతి భాగోతం ఒక్కొక్కటి గా వెలుగుచూసోంది. అనర్హులకు పట్టాలు ఇచ్చి వాటిని రిజిస్ర్టేషన్‌ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతి మాయాజాలం నేడు అధికారులకు పెద్ద తల నొప్పిగా మారింది.

ఇంకెన్ని ఇచ్చారో..?

వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు, సిబ్బంది నిర్వాకం

వెలుగులోకి మరిన్ని మోసాలు.. పట్టాల రద్దుకు సిఫారసు

(నరసాపురం–ఆంధ్రజ్యోతి):

దర్భరేవు కంపెనీ భూముల రిజిస్ర్టేషన్లలో చోటు చేసుకున్న అవినీతి భాగోతం ఒక్కొక్కటి గా వెలుగుచూసోంది. అనర్హులకు పట్టాలు ఇచ్చి వాటిని రిజిస్ర్టేషన్‌ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతి మాయాజాలం నేడు అధికారులకు పెద్ద తల నొప్పిగా మారింది. ఒక్కొక్కటి వెలుగు చూస్తుం టే.. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలి యక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విచారించి ఒక్కొక్క పట్టాను రద్దు చేస్తున్నారు. దర్భరేవు కంపెనీ భూముల రైతుల పోరాటం 30 ఏళ్లుగా సాగుతోంది. బ్రిటిష్‌ హయాంలో కొంతమంది రైతులు కంపెనీగా ఏర్పడి భూము లను సాగు చేశారు. నరసాపురం నుంచి పంట కాల్వలను స్వయంగా తవ్వుకుని వేము లదీవి ఛానల్‌గా నామకరణం చేసుకున్నారు. వందేళ్ల నాటి చౌడు భూములను సస్య శ్యామలం చేశా రు. అప్పటి నుంచి ఇవన్నీ దర్భరేవు కంపెనీ కిందే ఉన్నాయి. ఇలా నరసాపురం మండలం లో 1,750 ఎకరాలు ఉంది. ఈ భూముల్లో సుమారు 1,400 మందికిపైగా రైతులు ఉన్నా రు. రాష్ట్ర విభజన తర్వాత 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టాలు రిజిస్ర్టేషన్‌ చేసి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం మారడం తో ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం 2021లో కొత్త జీవోను విడు దల చేసి రైతులకు పట్టాలిస్తున్నట్లు ప్రకటిం చడంతో అవినీతికి తెరలేపారు. కొందరు అధికారులు, కంపెనీ సిబ్బంది కలిసి సాగు రైతులకు కాకుండా మరొకరికి పట్టాలిచ్చి వాటి ని రిజిస్ర్టేషన్‌ చేశారు. వీటిపై అనేక ఆరోపణ లు వచ్చినా వీటిని తొక్కిపెట్టారు.

ఒక్కొక్కటి వెలుగులోకి

ఈ ఏడాది పట్టణానికి చెందిన రఘువెంకట సత్యరఘునారాయణ తమ తండ్రి కందుల వెంకటకృష్ణరాజు పేరున ఆర్‌ఎస్‌ నెంబర్‌ 12 /సిలో 40 సెంట్లు, ఆర్‌ఎస్‌ నెంబర్‌ 307/7న 1.60 సెంట్లు మొత్తం రెండు ఎకరాల భూమి వారసులమైన తమకు కాకుండా మరొకరికి రిజిస్ర్టేషన్‌ చేశారని ఫిబ్రవరిలో తహసీల్దార్‌ రాజరాజేశ్వరికి ఫిర్యాదుచేశారు. ఆమె వీఆర్వోతో విచారణ చేయించారు. చనిపోయిన రైతుకు నలుగురు కుమారులు ఉన్నారని, అయితే వారసులు లేరని చూపించి ఆమె కుమార్తె పేరున రిజిస్ర్టేషన్‌ చేయించారని వీఆర్వో మెహ ర్‌బాబా నివేదిక ఇచ్చారు. కంపెనీ ఉద్యోగి పొర పాటు జరిగిందని తహసీల్దార్‌కు రిపోర్టు చేశా రు. ఆమె మార్చి 31న పట్టాను రద్దు చేయా లని సబ్‌ రిజిస్ట్రర్‌కు లేఖ రాశారు. ఇది అమలు కాకపోవడంతో బాఽధితుడు ఆర్డీవో దాసి రాజుకు ఫిర్యాదుచేశారు. ఆయన విచారించి పట్టాను రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రర్‌కు రాశారు. ఇలాంటి ఘటన మరొకటి. ఒడుగు గంగరాజు అనే రైతు ఇటీవల ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారిస్తున్నారు.

ఆ పట్టాను రద్దు చేయిస్తాం

దర్భరేవు భూముల రిజిస్ర్టేషన్‌లో అప్పటి అధికారులు వారసులకు కాకుండా మహేశ్వరికి పట్టా ఇచ్చారు. ఇప్పటికే విచారణ చేశాం. దీనిని రద్దు చేయాలని సబ్‌ రిజిస్ర్టార్‌ను ఆదే శించాం. అయితే రిజిస్ర్టేషన్‌ జరిగి రెండేళ్లు గడిచింది. రద్దు చేసే అధికారం కలెక్టర్‌ ఉంది. దీన్ని రద్దు చేయాలని కలెక్టర్‌కు నివేదించాం.

– దాసి రాజు, ఆర్డీవో

మోసం బయటపడింది

చనిపోయిన మా నాన్న పేరునే కంపెనీ భూమి, షేర్లు ఉన్నాయి. నిబంధ నల ప్రకారం వారసులైన మా నలుగురికి భూమి పట్టాలు ఇవ్వాలి. కాని, అధికారులు, కంపెనీ సిబ్బంది ప్రలోభాలకు లోనై మరొకరికి పట్టా ఇచ్చారు. దీనిపై ఫిర్యా దు చేశాం. ఇప్పటికి మా పేరున పట్టా రాలే దు. ఇచ్చిన పట్టాను రద్దు చేయడం లేదు.

– సత్యరఘునారాయణ, రైతు

Updated Date - May 24 , 2025 | 12:52 AM