Share News

కుళ్లిన గుడ్లతో భోజనమా ?

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:34 AM

కుళ్లిన గుడ్లను వండి తమ పిల్లలకు భోజనం పెడ తారా ? అంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పై మండిపడుతున్నారు.

కుళ్లిన గుడ్లతో భోజనమా ?

కాళ్ల హైస్కూల్‌లో నిర్వాకం

వంట బాగా లేక పిల్లలు తినడం లేదు.. తల్లిదండ్రుల ఫిర్యాదు

పట్టించుకోని విద్యాశాఖాధికారులు

450 మంది విద్యార్థులకు.. ఇక్కడ మధ్యాహ్న భోజనం చేసేది 150 మందే

కాళ్ళ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):కుళ్లిన గుడ్లను వండి తమ పిల్లలకు భోజనం పెడ తారా ? అంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పై మండిపడుతున్నారు. ఈ విషయమై ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళ్ల జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు బుధవారం మధ్యా హ్న భోజనం వడ్డించేందుకు కుళ్లిన గుడ్లను వండారు. గుడ్లు పాడయ్యాయని వంట చేసిన నిర్వాహకులు చెప్పినప్పటికి ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. వాటిని వండుతున్న సమ యంలో కుళ్లిన గుడ్లు రంగు మారి దుర్వాసన వచ్చాయి. ఆ సమయంలో విజిటింగ్‌కి వచ్చిన విద్యా శాఖ సిబ్బంది(సీఆర్పీ) దీనిని గుర్తించి, వాటిని బయట పారేయించారు. ఇలాంటివి ఎప్పుడూ వండకూడదని చెప్పారు. విషయా న్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఈ స్కూల్‌లో తీరు మారలేదని మండిపడున్నారు. విద్యాశా ఖాధికారులకు చెప్పినా తూతూమంత్రంగా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా కుళ్లిన గుడ్లు తిని తమ పిల్లలు అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యతవహిస్తారని ప్రశ్నించారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. పాఠశాలలో 450 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో కేవలం 150 మంది మాత్రమే ఇక్కడ తింటున్నారు. మిగిలిన వారంతా ఇళ్ల దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. సమస్యను డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కుళ్లిన గుడ్లపై ఎంఈవో డి.శ్రీనివాసరావును వివరణ కోరగా పాఠశాలకు వెళ్లి పరిశీలించిబాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూస్తానని స్పష్టం చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 12:34 AM