Share News

ఆహా.. ఏమి రుచి

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:37 AM

వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. మొదటిరోజు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.

ఆహా.. ఏమి రుచి

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం

చాలా రుచిగా ఉందన్న విద్యార్థులు

తొలి రోజు 1392 పాఠశాలల్లో 98 వేల మందికి

(భీమవరం రూరల్‌/పెంటపాడు–ఆంధ్రజ్యోతి)

వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. మొదటిరోజు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. పౌర్ణమి తర్వాతి వచ్చే పాడ్యమి మంచిరోజు కావడంతో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపారు. జిల్లాలో 1392 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో సగం మందికిపైగా విద్యార్థులు మొదటిరోజు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. మరోవైపు పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు తీసుకు వచ్చాయి. ఇప్పుడు సన్న బియ్యం ఉపయోగించడం విద్యార్థులు భోజనం ఇష్టంగా మారింది. జిల్లాలోని 1392 ప్రభుత్వ పాఠశాలల్లో 98 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి రుచికరమైన, పోషకాలు కలిగిన భోజనం మద్యాహ్న భోజనంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ విద్యా సంవత్సరం మొదటిరోజే సన్నబియ్యంతో భోజనం అందించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సన్నబియ్యం భోజనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి వారు మధ్యాహ్న భోజనం చేశారు.

సంతోషంగా.. తృప్తిగా భోజనం చేశాం

మా స్కూల్‌లో గతంలో భోజనం ఒక్కోసారి ఇబ్బందిగా ఉండేది. ఈ రోజు సన్న బియ్యంతో చేసిన భోజనం తిన్న తర్వాత గతంతో పోలిస్తే చాలా బాగుంది. అందరం తృప్తిగా తిన్నాం. మాకు పుస్తకాలు ఇచ్చారు. తీసుకున్నాం. మా స్కూల్‌లో చదువు బాగా చెబుతారు.

– వి.సందీప్‌, ఆదర్శ పాఠశాల పెంటపాడు

సన్నబియ్యం అన్నం చాలా బాగుంది. నేను మా పెండ్స్‌ అందరం కూడా సంతోషంగా భోజనం చేశాం. గతంలో వండిన అన్నం కొన్ని సార్లు ముద్దలుగా ఉండిపోయేది. బియ్యం కారణంగానే ఈ సమస్య వచ్చేది. ఇప్పడు మాకు ఆ ఇబ్బంది లేదు. సన్నబియ్యం తో తృప్తిగా భోజనం చేస్తాం.

– కె.అక్షయ, పెంటపాడు

సన్నబియ్యంతో భోజనం ఇంటి భోజనంగా ఉంది. మంచి చదువుతోపాటు రుచికరమైన భోజనం మధ్యాహ్న భోజన పథకంలో అందించడం చాలా ఆనందంగా ఉంది.

– దుర్గా, విద్యార్థిని, భీమవరం

గత విద్యా సంవత్సరం చివరి నుంచి మధ్యాహ్న భోజనంలో మెనూ మార్చి పోషకాలు కలిగిన కూరలు పెట్టారు. గతంలో అలా ఉండేవి కాదు. ఇప్పుడు సన్నబియ్యం అన్నం పెట్టడం ఇంకా బాగుంటుంది.

– కీర్తన, భీమవరం

Updated Date - Jun 13 , 2025 | 12:37 AM