Share News

మెప్మా.. జాబ్‌మేళా

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:22 AM

మెప్మా దృష్టి పెట్టింది. స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలతోపాటు మిగిలిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.

మెప్మా.. జాబ్‌మేళా

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

భీమవరం టౌన్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి):జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా

మెప్మా దృష్టి పెట్టింది. స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలతోపాటు మిగిలిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక జాబ్‌ మేళాలను నిర్వ హిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా–నిపుణ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చు కుని జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. 11 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి సెలక్ట్‌ అయి న వారికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటి వరకు జాబ్‌మేళాలు కళాశాలల్లోనే జరిగేవి. మెప్మా ఆధ్వర్యం లో తొలిసారిగా మహిళా సంఘాల సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు వీటిని ఏర్పాటుచేశారు.

రిజిస్ట్రేషన్‌ తప్పని సరి

జాబ్‌ మేళాకు వచ్చే వారు తప్పని సరిగా ఆన్‌లైన్‌లో వారి పేరు నమోదు చేయించుకోవాలి. వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నెంబరు 81212 12873 నెంబర్‌లో సంప్రదించాలి. లేకుంటే పట్టణాల్లోని మునిసిపల్‌ కార్యాలయంలో వున్న మెప్మా విభాగంలో సంప్రదించవచ్చు.

అర్హతలు ఇవీ..

టెన్త్‌, ఇంటర్‌, డిప్లమో, బిటెక్‌, ఎంటెక్‌, డిగ్రీ, పీజీ, ఫార్మా, నర్సిం గ్‌ వంటి వాటిలో ఉత్తీర్ణత సాధించిన వారు హాజరు కావచ్చు.

వచ్చే కంపెనీలు

టీసీఎస్‌, టీమ్‌ లీజ్‌, జస్ట్‌ డయల్‌, మెడ్‌ప్లస్‌, పేటీ ఎం, ఎంఆర్‌ఎఫ్‌, ముత్తూ ట్‌ ఫైనాన్స్‌, హెటిరో, జియో, హెచ్‌డీబీ ఫైనాన్షి యల్‌ సర్వీసెస్‌ తదితర కంపెనీలు.

జాబ్‌మేళా నిర్వహించే చోటు

భీమవరం మునిసిపల్‌ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ లేదా 21వ తేదీల్లో ఈ జాబ్‌ మేళా ఏర్పాటు చేసే అవకాశం వుంది.

Updated Date - Nov 09 , 2025 | 01:22 AM