ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:08 AM
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో పాఠశాల ల్లో పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించని ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకంపై కలెక్టర్ సమీక్ష
ఏలూరు అర్బన్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో పాఠశాల ల్లో పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించని ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యా హ్న భోజన పథకం అమలుతీరును శుక్రవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లా డుతూ రుచి, శుచి లేని కారణంగా కొన్ని పాఠశాలల్లో కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించ డం లేదని, ఈ లోపాలను అధిగమించి నూరు శాతం విద్యార్థులు భోజనాన్ని స్వీకరించేలా చర్యలు తీసుకో వాలన్నారు. నాణ్యమైన భోజనం అందించని ఏజన్సీల పై, సక్రమంగా పర్యవేక్షించని ఉపాధ్యాయులపై చర్య లు తీసుకుంటానని హెచ్చరించారు. ఇటీవల రెండు రోజులపాటు జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసిన ఆహార కమిషన్ సభ్యులు అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, మహిళలకు అందించే ఆహారం నాణ్యత లేకపోవడం, వంట నూనె, గుడ్లు వంటి నిల్వలు సక్రమంగా లేన ట్టు గుర్తించారని, సూపర్‌వైజర్లు, సీడీపీవోల పర్యవే క్షణ, తనిఖీలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల నివేదికలను సమర్పించాలని ఐసీడీఎస్ పీడీ శారదను ఆదేశించారు. జేసీ అభిషేక్ గౌడ, పౌరసరఫ రాల శాఖ జిల్లా మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బందికి నోటీసులు
పెదపాడు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):ఈ నెల 13న సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించ కపోవడంపై ‘గాడిన పడాలి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. పెదపాడు–1 సచివాలయంలోని వివిధ విభాగాలకు చెందిన తొమ్మిది మంది సిబ్బందికి శుక్రవారం షోకా జ్ నోటీసులు జారీచేశారు. మూడు రోజుల్లోగా వివర ణ ఇవ్వాలంటూ ఆదేశించారు.