Share News

దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:40 PM

‘దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. దేశానికి, రాష్ట్రానికి ఆస్తి విద్యార్థులే.. విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచుతూ విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా చరిత్రను, సంస్కృతిని గుర్తు చేసేలా సేవలందించిన వ్యక్తులు పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థ వంతంగా అమలు చేస్తున్నాం’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సారథి

రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే లక్ష్యం

మెగా పీటీఎంలో మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):‘దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం. దేశానికి, రాష్ట్రానికి ఆస్తి విద్యార్థులే.. విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచుతూ విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా చరిత్రను, సంస్కృతిని గుర్తు చేసేలా సేవలందించిన వ్యక్తులు పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థ వంతంగా అమలు చేస్తున్నాం’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ‘తల్లికి వందనం కింద 67.50 లక్షల మంది విద్యార్థులకు రూ.10 వేల కోట్లు అందజేశాం. కూటమి ప్రభుత్వం రాగానే రాజకీయ నాయ కులు ఫొటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. 16,347 టీచర్లను నియమించాం. బాలికలకు, మహిళలను గౌరవించడం చిన్న వయస్సు నుంచే నేర్పించాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి’ అన్నారు. రూ.97.40 లక్షలతో నిధులతో బాలి కల గ్రంథాలయం, కెమిస్ట్రీ, బయాలజికల్‌ ల్యాబ్‌లు, పలు అభివృద్ధి కార్యక్రమా లను మంత్రి ప్రారంభించారు. సబ్‌ కలెక్టర్‌ వినూత్న, డీవైఈవో సుధాకర్‌, తహసీల్దార్‌ బద్రు, ఎంపీడీవో రాఘవేంద్రనాథ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ పీరయ్య, ఎంఈవో వరప్రసాద్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ, ప్లోర్‌ లీడర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్‌, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ నేరుసు నాగులు, హెచ్‌ఎం బొమ్మిశెట్టి అనురాధ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

మెగా పీటీఎం సక్సెస్‌

జిల్లాలో 1.19 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ పాఠశాలల్లో శుక్ర వారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 విజయవంతమైందని డీఈవో వెంకట లక్ష్మమ్మ, సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ పంకజ్‌కుమార్‌ తెలిపారు. మంత్రులు, ఎమ్మె ల్యేలు, కలెక్టర్‌, జేసీతోపాటు 1,748 ఎంపీపీ, ఎయిడెడ్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఏపీ రెసిడెన్షియల్‌, కేజీబీవీ పాఠశాలల్లో 1.19 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, సేవాసంస్థల ప్రతినిధులు, దాతలు ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. సమావేశంలో పేరెంట్స్‌ నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించడానికి పీటీఎంలు ఉపయోగపడ్డాయన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:40 PM