Share News

తల్లీ బిడ్డల ఆరోగ్యానికి లక్షల కోట్లు

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:26 AM

దేశంలో స్త్రీ శక్తి బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

తల్లీ బిడ్డల ఆరోగ్యానికి లక్షల కోట్లు
విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కేంద్ర మంత్రి వర్మ

స్వస్థ నారీ, స్వశక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమం

ఆకివీడు సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): దేశంలో స్త్రీ శక్తి బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మోదీ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ, స్వశక్తి పరివార్‌ అభియాన్‌ నిర్వ హించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్మ మాట్లాడుతూ గర్భిణులు, శిశివులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని చెప్పా రు. తల్లీ బిడ్డా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతోకూటమి ప్రభుత్వం వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. మహిళలకు బాల్యం, కౌమారం, యవ్వనం, నడివయ స్సు, వృద్ధాప్య దశలలో ఆరోగ్య సంరక్షణ కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ నిర్వహిస్తోందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ స్త్రీలను ఎక్కడ పూజించి, గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారనే నానుడిని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోం దని, అందుకే కేంద్ర–రాష్ట్రాలు సస్య శ్యామలంగా ఉన్నాయన్నారు. కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి మాట్లాడు తూ అక్టోబరు రెండో తేదీ వరకు జిల్లాలో ప్రతీరోజూ 471 ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తు న్నట్టు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరాలను వైద్య నిపుణులు, పారా మెడికల్‌ సిబ్బంది ద్వారా నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర నోడల్‌ అధి కారి ఈ.ప్రశాంత్‌, డీసీహెచ్‌ఎస్‌ పి.సూర్యనారాయణ, డీఎం హెచ్‌వో గీతాబాయి, ఐసీడీఎస్‌ పీడీ డి.శ్రీలక్ష్మి, మెడికల్‌ అధికారి ఆదిలక్ష్మి, గణేష్‌, వైద్యులు బిలాల్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి వాణివిజయరత్నం, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జుత్తిగ నాగరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు మోటుపల్లి రామవరప్రసాద్‌, మా జీ సర్పంచ్‌ గొంట్లా గణపతి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్య క్షులు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, గంధం ఉమా, నౌకట్ల రామారావు, పిల్లా బాబులు, బాలాజీ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు చేసి పౌష్టికాహారం కిట్లు అందజేశారు. మోదీ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధిగ్రస్తులకు పండ్లు పంచి, మొక్కలు నాటారు. విశ్వ కర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Sep 18 , 2025 | 12:26 AM