మావుళ్లమ్మ నిజరూప దర్శనం నిలిపివేత
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:41 AM
భీమవరం మావుళ్లమ్మ 62వ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ వారికి అలంకారం నిమిత్తం నిజరూపదర్శనం బుధవారం నుంచి నిలిపివేశారు. తిరిగి ఈ నెల 29న పునఃదర్శనం కల్పిస్తారు.
భీమవరంటౌన్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి):భీమవరం మావుళ్లమ్మ 62వ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ వారికి అలంకారం నిమిత్తం నిజరూపదర్శనం బుధవారం నుంచి నిలిపివేశారు. తిరిగి ఈ నెల 29న పునఃదర్శనం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఉదయం ఆలయ ప్రధానార్చకుడి పర్యవేక్షణంలో అమ్మవారికి కళాపకర్షణ నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించి, అమ్మవారి కళలను ప్రత్యేక కలశంలో నిక్షిప్తం చేశారు. మేళతాళాలతో ఆలయానికి వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఉంచారు. 29న ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కళలను తిరిగి అమ్మ వారి విగ్రహంలో నిక్షిప్తంచేసి నిజరూప దర్శనం కల్పి స్తారు. సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షించారు.