మాస్టర్ ప్లాన్..తిరకాసు!
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:44 AM
గత వైసీపీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో ప్రధాన రహదారిని 60 అడుగులకు కుదించి మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు. అదే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రహదారికి ఇరువైపులా ఉన్న స్థల యజమానులకు తల నొప్పిగా మారింది.
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ భూముల్లో రహదారి 60 అడుగులకు కుదింపు
ఇరువైపులా స్థల యజమానులకు ప్లాన్‌లు నిరాకరణ.. ఎన్‌వోసీ తెస్తేనే అనుమతి
సామాన్యుల పరిస్థితి ఏమిటి..?
వెంటాడుతున్న గత పాలకుల పాపం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో ప్రధాన రహదారిని 60 అడుగులకు కుదించి మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు. అదే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రహదారికి ఇరువైపులా ఉన్న స్థల యజమానులకు తల నొప్పిగా మారింది. రహదారి లేదంటూ నిర్మాణాలకు అను మతి ఇవ్వడం లేదు. రహదారి చూపించాలని రెవెన్యూ అధి కారులను సంప్రదిస్తే విమానాశ్రయ భూముల్లో రహదారిని ఇవ్వలేమంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిర భ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకుంటేనే ప్లాన్ మంజూ రు చేస్తున్నారు. రహదారి మార్గాన్ని ఇస్తున్నారు. పలుకుబడి ఉన్న వారంతా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వరకే తెచ్చుకున్నవారంతా నిర్మాణా లు చేపడుతున్నారు. సామాన్యులైతే ప్రభుత్వానికి సంప్రదించే అవకాశమే లేదు. గత పాలకులు చేసిన తప్పిదం ఇప్పుడు రైతులను వెంటాడుతోంది. తాడేపల్లిగూడెం గణేష్ నగర్ జం క్షన్ నుంచి ఏపీనిట్, నన్నయ పీజీ క్యాంపస్, శశి ఇంజనీరింగ్ కళాశాలకు ఆనుకుని విమానాశ్రయ భూముల్లో 60 అడుగుల రహదారిని మాస్టర్ ప్లాన్‌లో ఇచ్చారు. గణేష్ నగర్ జంక్షన్ నుంచి శశి ఇంజనీరింగ్ కళాశాల వరకు 100 అడుగుల రహదారి విస్తరించి ఉంది. మాస్టర్ ప్లాన్‌లో 60 అడుగులకు కుదించడంతో ఇరువైపులా మరో 40 అడుగుల మిగిలి ఉంది. దానిని ప్రభుత్వ భూములుగా రెవెన్యూ శాఖ పరిగణిస్తోంది. వైసీపీ హయాంలో ఏకంగా అక్కడ పేదలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇరువైపులా రైతులు న్యాయ స్థానాన్ని ఆశ్ర యించడంతో ఇళ్లు కేటాయింపును రద్దు చేశారు. కానీ ఇప్పుడు రహదారికి ఇరువైపులా ఉన్న స్థల యజమానులు నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటే ప్లాన్ మంజూరు కావడం లేదు. రహదారికి, స్థలానికి మధ్యలో ఇప్పుడు విమానాశ్రయ భూములుంటున్నాయి. అదే 100 అడుగులు అలాగే ఉంచితే ఇబ్బంది ఉండేది కాదు. ప్లాన్‌లు మంజూరయ్యేవి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రహదారికి, ప్రైవేటు భూములకు మధ్య ఖాళీ భూమి ఉంది. అదే ఇప్పుడు నిర్మాణాలు చేపట్టాలంటే అవరోధంగా మారుతోంది.
ఎన్‌వోసీలు అందరికీ సాధ్యమేనా..
గత పాలకులు తాడేపల్లిగూడెంలో మాస్టర్ ప్లాన్‌ను తమ కు నచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేశారు. విమానాశ్రయ భూముల్లోనే అదే పరిస్థితి. గణేష్ నగర్ నుంచి శశి కళాశాల మీదుగా జాతీయ రహదారికి వెళ్లడానికి కీలకమైన పట్టణ రహదారిని కుదించేయడంతో ఇరువైపులా ప్రైవేటు భూమి యజమానులు ఎన్‌వోసీ తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఎన్‌వోసీ ఇస్తేనే విమానాశ్రయ భూముల్లో రెవెన్యూశాఖ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడే భవన నిర్మాణాలకు మున్సిపాలిటీ ప్లాన్ మంజూరు చేస్తుంది. శశి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నూతన నిర్మాణాలకు ఎన్‌వోసీ తెచ్చుకుంటోంది. ప్ర భుత్వంలో పలుకుబడి ఉన్న బిల్డర్‌లు అపార్ట్‌మెంట్ భవన నిర్మాణం కోసం ఎన్‌వోసీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాన్యులు పరిస్థితి ఏమిట నేది ప్రశ్నార్థకంగా మారింది. విమానాశ్రయ భూములకు ఇరువైపులా వందల ఎకరాల ప్రైవేటు భూములున్నాయి. వాటికి ఇదే రహదారి కీలకం కానుంది. కానీ నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్రభుత్వం ఎన్‌వోసీ జారీ చేయాలి.