ముంచుకొస్తున్న మౌఢ్యమి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:21 AM
ఈ మార్గశిరమాసంలో వివాహాలను చేసు కునేందుకు శుక్రమౌఢ్యమి కారణంగా అతి తక్కువ ముహూర్తాలు ఉన్నాయి.
శుభకార్యాలకు 76 రోజుల బ్రేక్..
మార్గశిరంలో తక్కువ ముహూర్తాల్లో మెండుగా పెళ్లిళ్లు..
ఈనెల 22 నుంచి 27 వరకు భారీగా పెళ్లిళ్లు
ద్వారకాతిరుమల, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): ఈ మార్గశిరమాసంలో వివాహాలను చేసు కునేందుకు శుక్రమౌఢ్యమి కారణంగా అతి తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు పెద్దలు తొందరపడుతున్నారు. ఈనెల 22 నుంచి 27 వరకు మాత్రమే మంచి ముహూర్తాలుండటంతో పలు జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నాయి. కార్తీకంలో అంతంత మాత్రంగా జరిగిన పెళ్లిళ్లు ఈ మార్గ శిరంలో తక్కువ ముహూర్తాలలో ఎక్కువగా కాను న్నాయి. అయితే మౌఢ్యమి కారణంగా కేవలం 6రోజులకే పరిమితం కానున్నాయి. ఇందుకు చిన వెంకన్న క్షేత్రం ఓ వేదిక కానుంది. ఆఖరి ముహూ ర్తాలైన ఈనెల 26, 27న భారీగా వివాహాలు జరుగనున్నాయని పంచాగకర్త, వాస్తు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కాశీభొట్ల పార్వతీశ్వర శర్మ చెబుతున్నారు. ఆతరువాత శుక్రమౌడ్యమి వస్తుం డటంతో దాదాపు 76రోజుల పాటు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఈనెల 30 నుంచి శుక్రమౌడ్యమి ప్రారంభమై మాఘ మాస బహుళ ఏకాదశి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు పెళ్లిళ్లు ఉండవు.
మూఢమి అంటే
ఇది ఒక అశుభకాలం. ఈ సమయంలో ఎటు వంటి శుభకార్యాలు తలపెట్టకూడదు. రవితో శుక్రుడు కలిసి ఉండే కాలమే శుక్రమౌడ్యమి. అలా గే గురుడుతో సూర్యుడు కలిసి ఉండేది గురు మౌడ్యమి అంటాం. శుభగ్రహాలైన గురు, శుక్రులు మౌడ్యమి సమయంలో తేజస్సును కోల్పోవడం వల్ల శుభకార్యాలు జరగవని పండితులు చెబుతు న్నారు.
ఏవి చేయచ్చు .. ఏవి చేయకూడదు
పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు, విద్యారంభ కార్యక్రమాలు, యాత్రలు, కొత్తప్రయాణాలు, కొత్త వ్యాపారాలు, రాజ్యాభిషేకం, వంటివి చేయకూ డదు. అయితే కొన్ని అనివార్య నిత్యకర్మలకు ఈ మౌఢ్యదోషం వర్తించదని చెబుతున్నారు. నిత్యప్ర యాణాలు, నిత్యారాధన, అభిషేకం, నవగ్రహ శాంతి, జప, హోమాదిశాంతులు, సీమంతం, నా మకరణం, అన్నప్రాసన, పాత ఇంటి మరమ్మతు లు, నూతన వస్త్రధారణ, చాతుర్మాసవ్రతాలు వం టివి శుక్రమౌడ్యమి రోజులల్లో వచ్చినా చేయవచ్చ ని పండితులు చెబుతున్నారు.
ఊపందుకుంటున్న పెళ్లి పనులు
ఇదిలా ఉంటే తక్కువ ముహూర్తాలకు తగ్గట్టే పెళ్లిళ్లు వందల సంఖ్యలో జరుగనున్నాయి. ఇప్పటి కే జిల్లాలో చాలా వరకు కల్యాణమండపాలు బుక్ అయ్యాయి. ప్రధానంగా శ్రీవారి క్షేత్రంలో ఈ ఆరు రోజుల్లో ఉండే ముహూర్తాల్లో ఎన్నో పెళ్లిళ్లు జర గనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా వరకు గదులు. సత్రాలు, కాటేజీలు. కల్యాణమండ పాలు బుక్ అయ్యాయి. కేటరింగ్, పచ్చిపూల మండ పాలు, అలంకరణ, లైటింగ్, బాజాబజంత్రీలు, ట్రావెల్స్, పురోహితులకు మంచి డిమాండ్ కనిపి స్తున్నది. పెళ్లిబృందాలవారు తమ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. వినియోగదారులను ఆకర్షించేం దుకు ఇప్పటికే క్షేత్రంలోని పలు ప్రైవేటు కల్యాణ మండపాలు, దేవస్థానం కల్యాణమండపాలు వి ద్యుద్దీపాలతో మిరుమిట్లుగొలుపుతున్నాయి. వివా హ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి పచ్చి పూల మండపాలు. రూ50వేలు నుంచి రూ.4ల క్షలకు పైగా డిమాండ్‌ను బట్టి పలుకుతున్నాయి.
మార్గశిరంలో మూహూర్తాలివే..
ఈనెల 22న రాత్రి 8.49 గంటలకు, 9.46, తెల్లవారుజామున 5.23 గంటలకు, 23న ఉదయం 9.28 గంటలకు, 10.59, 25న ఉదయం 5.11 గంటలకు, 26న ఉదయం 9.16, తెల్లవారుజామున 5.07 గంటలకు ముహూర్తాలున్నాయి. 27న ఉద యం 9.12, రాత్రి 8.28కు తెల్లవారుజామున 5.13 లకు, 28న ఉదయం 10.38లకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.