Share News

ఉల్లి ధర తగ్గింది

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:57 PM

మార్కెట్లో ఉల్లి ధర పడిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉల్లి తడిసిపోవడంతో ధర పతనమైంది.

ఉల్లి ధర తగ్గింది

పెరిగిన కూరగాయల ధర

నిలకడగా చికెన్‌

తాడేపల్లిగూడెం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో ఉల్లి ధర పడిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉల్లి తడిసిపోవడంతో ధర పతనమైంది. క్వింటా ఉల్లి సైజును బట్టి రూ. 500 నుంచి 1000 ధరకు విక్రయించారు. కర్నూ లు నుంచి 10 లారీల ఉల్లి తాడేపల్లిగూడెం మా ర్కెట్‌కు వచ్చింది. నాణ్యత తోపించడంతో కొను గోలు చేయడానికి చిరు వ్యాపారులు ముందుకు రాలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోవడంతో బస్తాల్లో డ్యామేజ్‌లు వచ్చాయి. బస్తాల్లో ఉండ గానే కొంత ఉల్లి కుళ్లిపోయింది. ఎన్నడూ లేనివి ధంగా కర్నూల్‌లో ఈ సీజన్‌లో ఉల్లిని సాగు చేశారు. పెద్ద సైజుల్లో ఉల్లి వచ్చిందని రైతులు ఆనందపడ్డారు. మంచి ధర వస్తుందని ఆశగా ఎదరు చూశారు. తీరా వర్షాల ప్రభావంతో ఉల్లి తడిసింది. అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది.

డిమాండ్‌ తగ్గని మహారాష్ట్ర ఉల్లి

మహారాష్ట్ర ఉల్లికి డిమాండ్‌ తగ్గలేదు. క్వింటా హోల్‌ సేల్‌ రూ.1500 నుంచి 2100 మఽఽధ్య విక్ర యిస్తున్నారు. రిటెయిలర్స్‌ రూ.100కు నాలుగు కేజీలు, నాసిరకం కలిపి రూ.100కు 5 కిలోల వంతున అమ్ముతున్నారు. గత వారంతో పోలిస్తే మహారాష్ట్ర ఉల్లి ధరలో పెద్దగా వ్యత్యాసం లేదు.

కూరగాయలు ప్రియం

మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే కిలోకు రూ.10పైగా పెరిగాయి. ఇటీవల భారీ వర్షాలకు కూరగాయ ల తోటలు దెబ్బ తినడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వినాయక చవితి తరువాత నుంచి కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల ప్రభావంతో తోటలు దెబ్బతినడంతో తోటలు తేరుకోవడానికి ఎక్కువ సమయం పడు తుందని చెబుతున్నారు. వినాయకచవితి వెళ్లిన తరువాత ఎక్కువగా ఉంటుందని చెబుతు న్నారు. దీనికితోడు దసరా ఉత్సవాలు తోడుకా వడంతో మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంగ కిలో రూ. 50 నుంచి 60, బీర రూ.30 నుంచి 50 దొండ రూ.30 నుంచి 40, దోస రూ.30 నుంచి 40, బెం డ రూ.30 నుంచి40, చిక్కుళ్లు రూ.110 నుంచి 120కు పెరిగింది. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.10 పెరిగాయి. అగాకర మాత్ర దిగి వచ్చింది. కిలో రూ.200 ఉండే ఆగాకర కాయలు రూ.160కు విక్రయిస్తున్నారు.

చికెన్‌ ధర మారలేదు

మార్కెట్‌లో చికెన్‌ ధరలు ప్రస్తుతం నిలక డగా ఉన్నాయి. గతవారం బ్రాయిలర్‌ కిలో రూ. 220 ఉండగా ఈ వారం కూడా అదేస్థాయిలో ఉంది. లేయర్‌ కిలో రూ.200కు అమ్ముతున్నారు. వీటి ధరలు వినాయక చవితి తరువాత తగ్గవ చ్చని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:57 PM