Share News

మామిడిని.. సాగు చేయలేం!

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:15 AM

రెండు దశాబ్దాలకు పైగా నూజివీడుతో మామిడికి విడదీయరాని సంబంధం ఉంది. గత రెండు దశాబ్దాలుగా మామిడి లో నెలకొంటున్న అననుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మామిడి రైతులు పంటకు క్రమేణా దూరమవుతున్నారు.

 మామిడిని.. సాగు చేయలేం!
నూజివీడు ప్రాంతంలో ఆయిల్‌పామ్‌ సాగు

ఉద్యానవన పంటల వైపు రైతుల మొగ్గు

మామిడి స్థానంలో పెరుగుతున్న ఆయిల్‌పామ్‌ పంట విస్తీర్ణం

చర్యలు తీసుకోకుంటే భవిష్యత్‌లో పూర్తిగా కనుమరుగు

(నూజివీడు టౌన్‌ – ఆంధ్రజ్యోతి)

రెండు దశాబ్దాలకు పైగా నూజివీడుతో మామిడికి విడదీయరాని సంబంధం ఉంది. గత రెండు దశాబ్దాలుగా మామిడి లో నెలకొంటున్న అననుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మామిడి రైతులు పంటకు క్రమేణా దూరమవుతున్నారు. ఇప్పటికే మామిడి రైతులు మామిడి తోటలను తొలగిస్తూ వాటి స్థానంలో మొక్కజొన్న, పత్తి, ఆయిల్‌పామ్‌, సాగుకు మొగ్గు చూపుతున్నారు.

ఉమ్మడి కృష్ణ జిల్లా పరిధిలోని నూజివీడు డివిజన్‌లో ఉన్న నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయితో పాటు తిరువూరు,విస్సన్నపేట, ఎ.కొండూరు, రెడ్డిగూడెం తదితర మండలాల్లో 60 వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం నూజివీడు డివిజన్‌ను ఏలూరు జిల్లాలో విలీనం చేయ డంతో నూతన నూజివీడు డివిజన్‌లో నూజివీడు, ఆగిరి పల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాలను కలిపారు. దీంతో మామిడి విస్తీర్ణంలో ఉద్యానవన పంటల ప్రకారం మామిడిలో దాదాపుగా ఎటువంటి మార్పు జరగలేదు.

పెరిగిన ఖర్చులు.. చీడపీడల ఉధృతి

మామిడికి రైతు దూరం అవడానికి ప్రధాన కారణం పెరిగిన ఖర్చులు, చీడపీడల ఉధృతి. తొలుత తుట్టి పురుగు అనంతరం కొవిడ్‌ ప్రభావంతో వరుసగా రెండే ళ్లు మార్కెట్‌ లేకపోవడం, అనంతరం కోడిపెను ఉధృతి తో పంట నాణ్యత దెబ్బతిని వరుసగా రెండేళ్లు పంటకు సరైన మార్కెట్‌ లేకపోవడం వంటి కారణాలతో వరుస కష్టాలు బాట పట్టిన మామిడి రైతులు మామిడి తొల గింపు మరింత వేగవంతం చేశారు.ఫలితంగా నూజివీడు డివిజన్‌ పరిధిలో మామిడి గత చరిత్రగా మారిపోయే పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం ఉద్యాన వన పంటల సాగులో పురోగతి కనిపిస్తోంది. మామిడి స్థానాన్ని ఆయిల్‌పామ్‌ పూరించడమే అని చెప్పవచ్చు. మామిడి సాగుకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతు న్నారు. మామిడిని దెబ్బతీస్తున్న చీడపీడల ఉధృతిని అరికట్టేందుకు పూర్తిస్థాయిలో ప్రయోగాలు చేపట్టడంతో పాటు నూజివీడు కేంద్రంగా మార్కెట్‌ ఏర్పాటు చేయా లని, మామిడి ఉప ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

వరుస నష్టాలతో మామిడికి దూరం..

మామిడికి చీడపీడలతో వరుస నష్టా లు కనీసం కౌలు తీసుకునేందుకు కౌలు రైతులు ముందుకు రాని పరిస్థితి. వారికి పెట్టుబడులు రాకపోవడంతో కౌలు రైతు లు ముందుకు రాలేదు. తోటల తొలగింపు తప్ప మామి డి రైతుకు వేరే మార్గం లేదు.

– మడుపల్లి నాగేంద్రరావు,

మామిడి రైతు, పోతిరెడ్డిపల్లి

మామిడి కన్నా ఆయిల్‌పామ్‌ మెరుగు..

దశాబ్దాలుగా మామిడి పైనే ఆధార పడి జీవిస్తున్నాం. ఏటా నష్టాలే. పామా యిల్‌ సాగు బాగుండడంతో మామిడిని తీసివేసి ఆయిల్‌పామ్‌ వైపు మొగ్గు చూపు తున్నాం.

– బొప్పూడి రంగారావు, మర్సపూడి

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు మొగ్గు

మామిడితో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు ఉన్న మెరుగైన పరిస్థితుల దృష్ట్యా రైతు లు దానిసాగు వైపు మొగ్గు చూపుతు న్నారు. కంపెనీల నుంచి బైబ్యాక్‌ ఉండ డం, ధరల్లో స్థిరీకరణ, కోతుల బెడద లేకపోవడం, చీడ పీడల ఉధృతి అంతగా లేకపోవడం వంటి కారణాలు రైతులను ఆయిల్‌పామ్‌ సాగుకు ఆకర్షిస్తోంది.

– ఆర్‌.హేమ, ఉద్యాన అధికారిణి

Updated Date - Nov 06 , 2025 | 12:15 AM