Share News

నేటి నుంచి మల్లాయపాలెం రైల్వే గేటు మూత

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:13 AM

గుడి వాడ–ముదినేపల్లి జాతీయ రహదారిలో మల్లాయ పాలెం రైల్వేగేటును మరమ్మతు పనుల కోసం ఈ నెల 8 నుంచి 22 వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటిస్తూ గేటు వద్ద గురువారం బోర్డు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి మల్లాయపాలెం రైల్వే గేటు మూత

ముదినేపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : గుడి వాడ–ముదినేపల్లి జాతీయ రహదారిలో మల్లాయ పాలెం రైల్వేగేటును మరమ్మతు పనుల కోసం ఈ నెల 8 నుంచి 22 వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటిస్తూ గేటు వద్ద గురువారం బోర్డు ఏర్పాటు చేశారు. ఈ 15 రోజులు వాహనాల మళ్లింపు ఎలా అని పోలీసు, ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.దీంతో గుడివాడ నుంచి ముదినేపల్లి మీదుగా భీమవరం ఆపై ప్రాంతాలకు, బంటుమిల్లి మీదుగా నరసాపురం తదితర ప్రాంతా లకు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను ఎలా మళ్లించాలన్న విషయమై పోలీసు అధికా రులు తర్జన భర్జన పడుతున్నారు.గుడివాడ నుంచి ముదినేపల్లి వరకు వాహనాలను మళ్ళించే ఏర్పాట్లు చేస్తే అక్కడి నుంచి అన్ని రూట్లకు వాహ నాలు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ముదినేపల్లి, కైకలూరు, బంటుమిల్లి ప్రాంతాలకు వాహనాలను ఏ రూటులో మళ్లించాలన్నది సమ స్యగా మారింది. నాలుగు రోజులు ముందుగా తమకు చెప్పిన వాహనాలను మళ్లింపుపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉండేదని, ఇప్పటి కిప్పుడు గేటు మూసివేత ప్రకటించడంతో తాము ఇరకాటంలో పడ్డామని ఆర్టీసీ అధికారులు చెబు తున్నారు. అయితే గుడివాడ నుంచి దొండపాడు, మోటూరు మీదుగా ముదినేపల్లి వెళ్లేందుకు, కార్లు, చిన్న వాహనాలను, గుడ్లవల్లేరు మీదుగా బస్సులు, ఇతర పెద్ద వాహనాలను, సిద్దాంతం, చౌటపల్లి మీదుగా కొత్త బైపాస్‌ ద్వారా ముదినేపల్లి రూటుకు వాహనాలను మళ్లించాలన్నది ప్రాథమికంగా నిర్ణయించామని గుడివాడ రూరల్‌ సీఐ సోమేశ్వర రావు తెలిపారు. ఏ రూటు అయితే రాక పోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 08 , 2025 | 01:13 AM