Share News

ముంచిన మొంథా

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:07 AM

తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. ఓ వైపు గాలులు.. మరోవైపు సముద్రపు హోరు.. ఇటు చూస్తే బోరున వర్షం.. కరెంటు లేదు.. ఏం జరుగుతుందో తెలియదు..

 ముంచిన మొంథా
గండిపడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

తుఫాన్‌ తీరం దాటినా వీడని భయం

ఎగసిపడిన కెరటాలు.. వెంటాడిన ఈదురుగాలులు.. వీడని వర్షం

కంటి మీద కునుకు లేకుండా గడి పిన తీర గ్రామాలు

నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు.. చెట్లు పడి ధ్వంసమైన విద్యుత్‌ వైర్లు

తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. ఓ వైపు గాలులు.. మరోవైపు సముద్రపు హోరు.. ఇటు చూస్తే బోరున వర్షం.. కరెంటు లేదు.. ఏం జరుగుతుందో తెలియదు.. మొంథా తుఫాన్‌ అంతర్వే దిపాలెం – బియ్యపుతిప్ప మధ్య తీరం దాటుతుందనే హెచ్చరికతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివర కు ప్రభుత్వ ముందస్తు చర్యలు సత్ఫలితాలని ఇచ్చాయి.

(భీమవరం/నరసాపురం రూరల్‌ –ఆంధ్రజ్యోతి)

జిల్లాను మొంథా తుఫాను ముంచి వెళ్లింది. కాకినాడ వద్ద తీరం దాటుతుందని అంతా అంచ నా వేశారు. చివరకు బియ్యపుతిప్ప వద్ద తీరం దాటనున్నట్టు రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రకటించ డంతో జిల్లా యంత్రాగం హై అలర్ట్‌ అయ్యింది. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈదురుగాలులు వీచిన మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇక తీరం దాటే సమ యంలో జిల్లా ప్రజలు ఊపిరి బిగబట్టి ఉన్నారు. తీర గ్రామాల ప్రజల్లో కంటి మీద కునుకు లేదు. ఎంతటి విపత్తు తెస్తుందోనని ఆందోళనకు గుర య్యారు. ప్రతిక్షణం ఒక యుగంలా గడచింది. మంగళవారం రాత్రి 11.30 గంటలకు పూర్తిగా తీరం దాటుతుందని, ఆ సమయంలో తీవ్ర తుఫాన్‌గా దాడి చేస్తున్న మొంథా జిల్లాలో ఎటు వంటి అల్లకల్లోలం సృష్టిస్తుందోనని ఆందోళన చెందారు. సీఎం చంద్రబాబు రాత్రి వేళ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కలెక్టరేట్‌లో ఉంటూ కలెక్టర్‌తో కలిసి తీర ప్రాంత పరిస్థితులను గమనిస్తూ వచ్చారు. అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంత్రి నిమ్మల రామానా యుడు తీరప్రాంతానికి చేరుకుని అక్కడ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. రెవెన్యూ, పోలీస్‌, ఇతర శాఖలన్నీ తీర ప్రాంతంలోనే గస్తీ ఉన్నాయి. అర్ధ రాత్రి 12 గంటలైంది. జిల్లా అంతా ప్రశాంతం గానే ఉంది. తుఫాన్‌ బియ్యపుతిప్ప సమీపంలోనే తీరం దాటిందా లేదా వేరొకచోట అన్న అనుమా నం కలిగింది. తుఫాన్‌కు ముందు వర్షం, ఈదు రుగాలులు వీచాయి. తీరం దాటే సమయంలో ఎటువంటి అలజడి లేకపోవడంతో జిల్లా అఽధికా రుల్లోనే ఆశ్యర్యం కలిగింది. మొత్తానికి అర్ధరాత్రి తర్వాత గండం గట్కెక్కిందని, ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాని, రాత్రి మూడు గంటల సమయంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారి సుడిగాలి వీచింది. గాలుల బీభత్సంతో వరిచేలు నేలవాలాయి. సుమారు 26,381 ఎకరా లకు నష్టం వాటిల్లింది. సూర్యోదయ సమయా నికి గాలులు తీవ్రత తగ్గిపోవడంతో నష్ట తీవ్రత అంచనాకంటే తగ్గింది. జిల్లా అంతటా తుఫాన్‌ తర్వాత ప్రశాంతత ఏర్పడింది. నష్టం తక్కువగా ఉండడంతో హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పడిన చెట్ల వెంటనే తొలగించారు. విద్యుత్‌ స్తంభం నేలకొరిగితే జేసీబీలతో సరిచే శారు. ఇలా అన్ని శాఖలు అలుపెరగకుండా కష్ట పడ్డాయి. పీఎం లంకలో సముద్రం వంద మీట ర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. తోటల్లోకి నీరు రావడంతో గ్రామస్థులు అందోళన చెందా రు. వేటలో 50 ఏళ్ల అనుభవం వున్న మత్స్యకా రులు సైతం సముద్రం ఒడ్డుకు వచ్చేందుకు వెనకడుగు వేశారు. మధ్యాహ్నానికి కడలి శాం తించి వెనక్కి వెళ్లినా.. హోరు తగ్గలేదు. గాలులు బలంగానే వీస్తూనే ఉన్నాయి. సముద్రాన్ని చూసేందుకు చాలామంది బీచ్‌లకు వచ్చారు.

విరిగిన చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు

తుఫాన్‌ బీభత్సానికి నరసాపురం, మొగల్తూ రు మండలాల్లోని తీర గ్రామాల్లో అంధకారం నెలకొంది. గాలులకు నరసాపురం మండలంలో 120కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు పడి 11 కేవీ విద్యుత్‌ వైర్లు ధ్వం సమయ్యాయి. బుధవారం రాత్రి పలు చోట్ల విద్యుత్‌ సరఫరా రాక చీకటిలో గడిపారు. స్థానిక విద్యుత్‌ సిబ్బందితోపాటు కడప నుంచి వచ్చిన సిబ్బంది బృందాలుగా పనులు పున రుద్దరిస్తున్నారు. 300 మంది నిరంతరం పనిచే స్తున్నా అక్కడక్కడా లైట్లు వెలగని పరిస్థితి. విద్యుత్‌ శాఖ ముందస్తుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది, తుఫాన్‌ బీభత్సాన్ని అంచనా వేసి వందలాది స్తంభాలు, విద్యుత్‌ వైర్లు, సిబ్బందిని సిద్ధం చేసింది. కొన్నిచోట్ల గంటల వ్యవధిలోనే సరఫరాను పునరుద్దరించారు. మండలంలోని రాజుల్లంక, వైఎస్‌ పాలెం, సీతారాంపురం, తూర్పుతాళ్లు, సారవ, పీఎం లంక, వేములదీవి, బియ్యపుతిప్ప గ్రామాల్లోని ప్రధాన విద్యుత్‌ వైర్లపై చెట్ల కొమ్మలు పడి తెగిపోయాయి. మొగల్తూరు మండలంలోని గ్రామాలు అంధ కారంగా మారాయి. 29 గంటల అనంతరం విద్యుత్‌ పునరుద్దరించడంతో గ్రామస్ధులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం లేకపోయినప్ప టికి గాలులకు నరసాపురం మండలంలో తర చూ విద్యుత్‌కు అంతరాయం వస్తూనే ఉంది. ఇటు పట్టణంలో సాయంత్రానికి చాలా ప్రాం తాల్లో విద్యుత్‌ను పునరుద్దరించారు.

పేరు పాలెం, కేపీపాలెం, పీఎం లంక బీచ్‌ల్లో పోలీసులు లేకపోవడంతో సందడి కనిపించింది. పీఎం లంకలోని కేంద్రాన్ని కలెక్టర్‌ నాగరాణి సందర్శించిన అందిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఆమె స్వయంగా వడ్డించి భోజనాలు చేశారు.

వరికి గండం

ముంపులో 10,309 ఎకరాలు

నేలనంటిన 16,072 ఎకరాలు

భీమవరం రూరల్‌/పెంటపాడు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ సార్వా సాగును నీట ముంచింది. జిల్లాలో పొట్ట దశలో వున్న పది వేల 309 ఎకరాలు ముంపునకు గురైంది. ఈనిక, గింజ పోసుకునే దశలో ఉన్న 16 వేల 72 ఎకరాలు నేలనంటింది. దానిపై వర్షపు నీరు చేరింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడం తో ముంపు మరింత పెరుగుతుంది. ముంపు వల్ల వరికి తెగుళ్లు తలెత్తే ప్రమాదం వుంది. పొడ, ఆకు ముడత, తెల్ల కంకి వంటివి వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నేలనంటిన చేలు దిగుబడి సగం వరకు తగ్గిపోతుంది. పూర్తిగా మునిగిన చేలల్లో ముం పు తగ్గిన తర్వాత నష్టం తేలుతుంది.

చేతికి వచ్చింది.. కాని..

చేతికి అందిన పొలం నోటికి అందకుండా తుఫాన్‌కు బలైంది. సార్వా సీజన్‌లో ఏటా రైతులకు ఈ బాధ తప్పడం లేదు. ఇప్పటికే రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. చేలు పడి పోవడం వల్ల కోత సమయంలో ఎకరానికి మూడు గంటలు పడుతుంది. ఇది అదనపు భారంగా మారుతుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

వెలగల శ్రీనివాసరెడ్డి, రైతు, పెంటపాడు

వర్షం వస్తే అప్పులే..

నేను 20 ఎకరాల వరకు కౌలు చేస్తున్నాను. ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలకుపైగా అప్పుచేసి పెట్టుబడి పెట్టా. పొలం చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ మా బతుకులపై నీరు కార్చింది. ఇప్పటికైనా ఆగితే పర్వాలేదు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి రాకపోయి నా వచ్చిన డబ్బులు కనీసం మగతాకు, మిష న్‌లకు అయినా సరిపోతాయి. ఒకవేళ వర్షం నీరు మొత్తం చేలపై పడిపోతే ఇక మా గతి అంతే.. మొత్తం అప్పులు పాలు అయిపోతాం

అడ్డగర్ల సూర్యనారాయణ, పెంటపాడు

Updated Date - Oct 30 , 2025 | 01:07 AM