లారీ బోల్తా : డ్రైవర్ మృతి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:51 AM
కుక్కునూరు భద్రాచలం ప్రధాన రహదారిలో పాలవాగు వద్ద జరిగిన ప్రమాదంలో లారీ బోల్తా పడడంతో డ్రైవర్ చరణ్‌ప్రీత్ సింగ్ (50) మృతి చెందాడు.
కుక్కునూరు, జూన్12 (ఆంధ్రజ్యోతి): కుక్కునూరు భద్రాచలం ప్రధాన రహదారిలో పాలవాగు వద్ద జరిగిన ప్రమాదంలో లారీ బోల్తా పడడంతో డ్రైవర్ చరణ్‌ప్రీత్ సింగ్ (50) మృతి చెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు చెన్నై నుంచి రాయ్‌పూర్‌కు డోజర్‌తో క్యాట్ వెహికల్ వెళుతుండగా పాలవాగు వద్ద అదుపు తప్పిన లారీ బోల్తాపడింది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కు పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థాని కుల సాయంతో డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు రాయ్‌పూర్‌కు చెందినవాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కొవ్వలి అడ్డరోడ్డు సమీపంలో..
దెందులూరు: జాతీయ రహదారి కొవ్వలి అడ్డరోడ్డు సమీపంలో గురువారం ఉద యం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచా రం అందుకున్న పెదవేగి సీఐ రాజశేఖర్, దెందులూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృత దేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.
కారు.. లారీ ఢీకొని..
పాలకొల్లు టౌన్: పాలకొల్లు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కుంపట్ల రామ్‌గోపాల్ (41) గురువారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. రామ్‌గోపాల్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి పాలకొల్లు తిరిగి వస్తున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో కారు–లారీ ఢీకొనడంతో రామ్‌గోపాల్ అక్కడికక్కడే మృ తి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య కుమారిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చారు. ఆయన కుమారుడు, కుమార్తెకు స్వల్ప గాయాల య్యాయి. మంచివాడుగా పేరొందిన రామ్‌గోపాల్ మృతితో పట్టణంలో విషాద చాయలు అలముకున్నాయి.
మోటారు సైకిళ్లు ఢీకొని..
ఏలూరు క్రైం: మోటారు సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో గాయపడిన వ్యక్తిని ప్రభు త్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నూజి వీడు మండలం వెస్ట్ దిగవల్లి గ్రామానికి చెందిన కావూ రి కోటయ్య (52) మోటారు సైకిల్‌పై వెళుతుండగా ఏలూరు–చింతలపూడి మార్గంలో వలసపల్లి అడ్డరోడ్డు వద్ద ఎదురుగా మోటారు సైకిల్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కోటయ్యను ధర్మాజీగూడెం పీహెచ్‌సీకి అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యులు పరీక్షించి అప్పటికే కోటయ్య మృతి చెందాడని నిర్ధారించారు. ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు.