Share News

వీధి వ్యాపారులకు రుణాలు

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:16 AM

వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడం ద్వారా ఆర్థి కంగా బలోపేతం చేయడం, సత్వరం వివిధ పథకాల లబ్ధి పొందే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వీధి వ్యాపారులకు రుణాలు
నూజివీడులో స్వనిధి ప్రారంభించి మాట్లాడుతున్న తేజ్‌భరత్‌

పీఎం స్వనిధి 2.0 అమలు

ప్రయోగాత్మకంగా తొలుత నూజివీడులో ప్రారంభం

రూ. 2 లక్షల వరకు రుణాలు

లోక్‌ కల్యాణ్‌ పేరిట అవగాహన కార్యక్రమాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడం ద్వారా ఆర్థి కంగా బలోపేతం చేయడం, సత్వరం వివిధ పథకాల లబ్ధి పొందే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏలూరు జిల్లా నూజివీడులో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ పీఎం స్వనిధి పథకంపై లోక్‌ కల్యాణ్‌ పేరిట బుధవారం అవగాహన కల్పించారు.

వీధి వ్యాపారులంద రిని ఒక గొడుగు కిందికి తెచ్చి ప్రధానమంత్రి ఆత్మనిర్బర్‌ నిధి (పీఎం స్వనిధి)–1 పథకం గతంలో అమలుచేసి వారికి రూ.10 వేలు, రూ.20వేల చొప్పున రుణాలు అందించారు. సకాలం లో తిరిగి చెల్లించిన వ్యాపారులకు మరిన్ని రుణాలు అందించడానికి స్వనిధి–2.0 తాజాగా అమలు చేస్తు న్నారు. కొత్తవారికి కూడా అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు మెప్మా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏలూరులో 6,770, నూజివీడులో 1,995 మంది, జంగారెడ్డిగూడెంలో 1962, చింతలపూ డిలో 24 మంది వీధి వ్యాపారులను గుర్తించారు.

గుర్తింపు కార్డులే కీలకం..

గతంలో వివిధ సర్వేల ద్వారా వ్యాపారులను మెప్మా అధికారులు గుర్తించారు. గ్రీన్‌ జోన్‌లో వ్యాపారాలు చేసే వారిని వెండర్‌ జోన్‌గా నిర్దేశించి గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాం కర్లు అందిస్తున్నారు. 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సకాలంలో రుణాల ను తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీ రియింబర్స్‌ చేస్తుండడంతో వారిలో జవాబుదారీతనం పెరిగింది. రెండో విడత రుణ మొత్తం పెంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష పైగా రుణాలు పొందవచ్చు. వీధి వ్యాపారులంతా రుణ సదుపాయం వినియోగిం చుకునేలా మెప్మా అధికారులు సహకరిస్తారు.

పలు పథకాలు వర్తింపు

వీధి వ్యాపారులుగా నమోదైన వారి కుటుంబ సభ్యులకు కూడా గుర్తింపు కార్డు ద్వారా ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన, వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌కార్డు, ప్రధాన మంత్రి జన్‌థన్‌ యోజన, నిర్మా ణ కార్మికుల సంక్షేమ బోర్డులో రిజిస్ర్టేషన్‌, ప్రధాన మంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి జననీ సురక్ష యో జన తదితర పథకాలు వర్తింపజేయనున్నారు.

చిన్న వ్యాపారులకు వరం..

చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. పూచీకత్తు లేకుండానే రుణాలను సులభంగా పొందవచ్చు. వ్యాపారులు మెప్మా జిల్లా కార్యాలయం, మునిసిపాల్టీల్లో మెప్మా హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ప్రయో జనం పొందవచ్చు.

– పి.మాధవి, మెప్మా పీడీ

షాపు ఏర్పాటు చేసుకున్నా..

నేను తోపుడు బండిపై ఫ్యాన్సీ వస్తువులను అమ్మేదాన్ని. మెప్మా అధికారుల ప్రోత్సాహంతో తొలుత 10వేలు, తరువాత రూ.20 వేలు, రూ.50 వేలు, రూ.2 లక్షలు రుణాలు పొంది వ్యాపారాన్ని అభివృద్ధి చేశాను. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించడంతో రూ.5 లక్షల రుణం ఇచ్చారు. షాపును అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాను.

– నళిని, జంగారెడ్డిగూడెం

సాఫీగా వ్యాపారాలు

పేద వ్యాపారులకు స్వనిధి రుణాలు ఎంతో ఉపయోగపడు తున్నాయి. వ్యాపార విస్తరణకు ఈ పథకం ఉపయుక్తం. కొత్త వ్యాపారులు కూడా మెప్మా కార్యాలయంలో సంప్రదించి లబ్ధిపొందాలి.

– దోర శివప్రసాద్‌, వీధి విక్రయదారుల సమాఖ్య అధ్యక్షుడు, ఏలూరు

Updated Date - Sep 25 , 2025 | 12:16 AM