రుణం కావాలంటేనే..
ABN , Publish Date - May 11 , 2025 | 01:03 AM
స్వయం సహాయక సంఘాల మహిళా సంఘాలు. ఒక్కో సంఘం లో పది మంది సభ్యులు వుంటారు. వీరు ప్రతి నెలా పొదుపు చేస్తే.. సంఘానికి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు.
గ్రూపులో సభ్యురాలికి అవసరమైన మేరకే రుణం.. వద్దనుకున్న వారికి ఇవ్వరు
తీసుకున్న వారు చెల్లిస్తే చాలు
కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వం సిద్ధం
జిల్లాలో మహిళల అవసరాలపై సర్వే
ఈ ఏడాది రూ.1,600 కోట్ల అంచనా
జిల్లా వ్యాప్తంగా 30 వేల మహిళా సంఘాల్లో మూడు లక్షల మంది సభ్యులున్నారు. బ్యాంకుల నుంచి ప్రతి సంఘం రుణం తీసుకుంటోంది. ఈ సారి స్వయం ఉపాధి పెంచేలా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
స్వయం సహాయక సంఘాల మహిళా సంఘాలు. ఒక్కో సంఘం లో పది మంది సభ్యులు వుంటారు. వీరు ప్రతి నెలా పొదుపు చేస్తే.. సంఘానికి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు. ఇలా వచ్చిన మొత్తంలో సభ్యులంతా సమానంగా పంచుకుని వారి అవసరాలు తీర్చుకుంటారు. వాయిదాల రూపం లో ప్రతీ నెలా బ్యాంకుకు అప్పు చెల్లిస్తారు. ఇందులో ఏ ఒక్కరు చెల్లించకపోయినా ఆ బాధ్యత గ్రూపుదే. జిల్లాలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు మేర రుణం తీసుకున్న సంఘాలు ఉన్నాయి. ఆ సంఘానికి ఎంత రుణం తీసుకో వాలో ఇప్పటి వరకు ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. అవసరానికి మించి అప్పులు తీసుకుని మహిళలు వాయిదా చెల్లించడానికి ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం ఈసారి కొత్త ఆలోచన చేసింది. ఇకపై రుణ లక్ష్యాలు ఉండవు. మహిళలకు అవసరమైన మేరకే రుణం తీసుకోవచ్చు. దీనికోసం జిల్లాలో సర్వే చేసి వివరాలు సేకరించారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మహిళలకు స్వయం ఉపాధిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఆ దిశగా మహిళా సంఘాలకు రుణ ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధి యూనిట్‌ల ఏర్పాటుకు రు ణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక గ్రూపులో సభ్యుల కు ఎవరికి ఎంత అవసరమో అంతే రుణం మంజూరు చేస్తారు. రుణం తీసుకున్న సభ్యురాలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి డీఆర్‌డీఏ వివరాలు సేకరించి రూ. 1600 కోట్ల రుణాల అంచనాతో ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఎన్నికల ముందు ఏడాది జిల్లాలో స్వయం సహాయక సంఘాలు రూ.3200 కోట్ల రుణాన్ని తీసుకు న్నాయి. మహిళల పేరుతో రుణాలు తీసుకుని నిధులు పక్కదారి పట్టిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఈసారి అలా కాకుండా సభ్యురాలి అవసరం మేరకే రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
రాయితీ రుణాలు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులకు రాయితీ రుణాలు అందజేయనున్నారు. వ్యక్తిగత స్వయం ఉపాధి యూని ట్‌ల స్థాపనకు గతంలో అవకాశం లేదు. గ్రూపు సభ్యు లందరికీ సమానంగా రుణాలు ఇచ్చేవారు. సంఘం మొత్తం యూనిట్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంది. లేదంటే మహిళలు తమ వంతు రుణం పెట్టుబ డిగా సొంత వ్యాపారాలు నిర్వహించారు. పెద్ద యూని ట్‌ల స్థాపన, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో రుణం పొందలేకపోయారు. పెట్టుబడి లేక పోవడంతో కొత్తగా వ్యక్తిగత యూనిట్‌లకు మహిళలు ఆసక్తి చూపలేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల విషయంలో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. గ్రూపులో సభ్యురాలు సొంతంగా రాయితీ రుణం పొందే అవకాశాన్ని ప్రభు త్వం కల్పిస్తోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం వంటి వాటి నుంచి 35 శాతం రాయితీతో మహిళలకు రుణాలు మంజూరు చేయనున్నారు. త్వరలోనే ప్రభు త్వం మహిళలకు రుణాల మంజూరులో పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.