బెల్ట్ తీస్తాం
ABN , Publish Date - May 26 , 2025 | 12:17 AM
జిల్లాలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని, నిరంతర నిఘా పెట్టామని ఎక్సైజ్ సూపరింటెం డెంట్ ఆనాల ఆవులయ్య హెచ్చరించారు.
ఐదు మద్యం షాపులకు అపరాధ రుసుం
ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య
ఏలూరు, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని, నిరంతర నిఘా పెట్టామని ఎక్సైజ్ సూపరింటెం డెంట్ ఆనాల ఆవులయ్య హెచ్చరించారు. ఎక్సైజ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. జిల్లాలో బెల్టు షాపులపై ఇప్పటి వరకు 456 కేసులు నమోదు చేసి 478 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్న కుక్కునూరు, ఏలూరు రూరల్, పెదవేగి, భీమడోలులోని ఐదు మంద్యం దుకాణాలను సీజ్ చేసి రూ.5 లక్షల చొప్పున అపరాధ రుసుం విధిం చామన్నారు. జిల్లాలో మొత్తం 155 మద్యం షాపులు న్నాయని, కచ్చితంగా ఎమ్మార్పీకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అమ్మకాలు జరగకుండా నిరంతరం సిబ్బంది నిఘా పెట్టినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 70 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నెలాఖరు నాటికి 140 గ్రామా లను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. సారా తయారీతో జీవనం సాగిస్తున్న పలువురికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తున్నామన్నారు. 35 కుటుం బాలకు చెందిన 138 మంది మహిళలకు ఉన్నతి, స్ర్తీ నిధి పథకాల్లో వడ్డీలేని రుణాలు అందించి స్వయం ఉపాధి పధకాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఆవులయ్య వివరించారు. జిల్లాలో ఎక్కడైనా బెల్ట్ షాపులు, సారా విషయాలపై 14405 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.