Share News

తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:46 AM

మద్యానికి డబ్బులు ఇవ్వలే దని కన్నతల్లిని ఆమె కట్టుకున్న చీరతోనే మెడకు చుట్టి హత్య చేసిన కుమారుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, వెయ్యి రూపా యల జరిమానా విధిస్తూ ఏలూరులోని రెండవ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని సోమవారం తీర్పు చెప్పారు.

 తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

ఏలూరు క్రైం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): మద్యానికి డబ్బులు ఇవ్వలే దని కన్నతల్లిని ఆమె కట్టుకున్న చీరతోనే మెడకు చుట్టి హత్య చేసిన కుమారుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, వెయ్యి రూపా యల జరిమానా విధిస్తూ ఏలూరులోని రెండవ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూ షన్‌ కథనం ప్రకారం కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాటికుంట నరసాపురం గ్రామానికి చెందిన జూట్రూ మారేషు అతని భార్య లక్ష్మి లు కొంతకాలంగా ఏలూరులో నివాసం ఉంటున్నారు. వారి కుమా రుడైన జూట్రు నాగతిరుపతిరావు(22) మద్యానికి బానిసయ్యాడు. 2021 సంవత్సరంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లి లక్ష్మిని నాగతిరుపతిరావు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆమె కట్టుకున్న చీరతోనే ఆమె మెడకు చుట్టి హతమార్చాడు. ఈ సంఘటపై లక్ష్మీ భర్త మారేషు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ కె.సి.హెచ్‌.స్వామి కేసు నమోదు చేయగా అప్పటి చింతలపూడి సీఐ అయిన ప్రస్తుతం స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఎంవిఎస్‌ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు రెండవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ సాగింది. హంతకుడైన నాగ తిరుపతి రావుపై నేరం రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదు, వెయ్యి రూ పాయల జరిమానా విధిస్తూ ఏలూరులోని రెండవ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసి క్యూషన్‌ తరపున ఎపీపీ చింతమనేని రమేష్‌ వాధించగా ప్రాసిక్యూష న్‌కు కోర్టు మానిటరింగ్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.నాగేశ్వరరావు, చింతలపూడి సీఐ సి.హెచ్‌.రాజశే ఖర్‌, చింతలపూడి ఎస్‌ఐ కె.కుటుంబరావు, హెడ్‌కానిస్టేబుల్‌ ఎం రాజేశ్‌లు సహకరించారు. హంతకుడికి శిక్ష పడటంలో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులను ఎస్పీ కిశోర్‌ అభినందించారు.

Updated Date - Jun 03 , 2025 | 12:46 AM