Share News

ఎల్‌ఐసీని అగ్రగామి సంస్థగా నిలుపుదాం

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:09 AM

జీవిత బీమా సంస్థను అన్నివిధాలు గా అగ్రగామిగా నిలపడం ఉద్యోగులుగా మనందరి బాధ్యత అని ఎస్‌సీజెడ్‌ఐ ఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్‌ అన్నారు.

ఎల్‌ఐసీని అగ్రగామి సంస్థగా నిలుపుదాం
సభలో మాట్లాడుతున్న ఎస్‌సీజెడ్‌ఐఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్‌

ఎస్‌సీజెడ్‌ఐఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్‌

పాలకొల్లు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జీవిత బీమా సంస్థను అన్నివిధాలు గా అగ్రగామిగా నిలపడం ఉద్యోగులుగా మనందరి బాధ్యత అని ఎస్‌సీజెడ్‌ఐ ఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్‌ అన్నారు. స్థానిక లయన్స్‌ క్లబ్‌ భవనంలో రాజమండ్రి డివిజన్‌ 28వ మహాసభ డివిజన్‌ ఉపాధ్యక్షుడు సుధాకర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఐఆర్‌డీఏఐ కొత్త ప్రతిపాదనల నేపథ్యంలో యూనియన్‌ సభ్యులుగా మన బాధ్యత పెరిగిందన్నారు. భవిష్యత్‌లో మార్పులు, చేర్పులు పాలసీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచిం చారు. సంస్థను అభివృద్ధి చేస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించుకోవాలని రవీంద్రనాథ్‌ సూచించారు. జీవిత బీమా ప్రీమియం ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టి రద్దు మన సంఘం కృషితో జరిగిందన్నారు. ప్రత్యేక అతిఽథి రాజమండ్రి డివిజన్‌ ఎల్‌ఐసీ ఎస్‌డీఎం సత్యనారాయణ సాహు మాట్లాడుతూ ఉద్యోగులం తా సమైక్యంగా ఉండాలని సూచించారు. బ్రాంచ్‌ యూనియన్‌ నాయకులు మురళీకృష్ణ, ఆహ్వాన సంఘం కన్వీనర్‌ ఎన్‌వీఎస్‌.బాపిరాజు, ఎం.కోదండరామ్‌ తదితరులు మాట్లాడారు. డివిజన్‌లోని పలు బ్రాంచ్‌ల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:09 AM