Share News

భూ లెక్కలు పక్కాగా!

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:42 AM

రైతుల ప్రయోజనం, ప్రవేట్‌ వ్యక్తుల భూములకు వివాదాలకు మోక్షం దిశగా ప్రభుత్వం భూముల రీ సర్వేను పక్కాగా చేస్తోంది. ఏడు నెలలు కాలంలో రెండు విడతలుగా ఎంతో పురోగతి సాధించగా, చివరి దశలో అన్ని భూముల లెక్కలను పక్కాగా తేల్చాలని డిసెంబర్‌ నెలాఖరుకు డెడ్‌లైన్‌ విధించింది.

 భూ లెక్కలు పక్కాగా!

మూడో విడత భూముల రీ సర్వే ప్రారంభం

మొదటి, రెండో విడతల్లో పైలట్‌ ప్రాజెక్టుగా 82 గ్రామాల్లో సర్వే పూర్తి

నవంబరు నాటికి సరిహద్దుల గుర్తింపు షురూ

డిసెంబరు నాటికి పట్టా భూముల లెక్కలు పూర్తి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రైతుల ప్రయోజనం, ప్రవేట్‌ వ్యక్తుల భూములకు వివాదాలకు మోక్షం దిశగా ప్రభుత్వం భూముల రీ సర్వేను పక్కాగా చేస్తోంది. ఏడు నెలలు కాలంలో రెండు విడతలుగా ఎంతో పురోగతి సాధించగా, చివరి దశలో అన్ని భూముల లెక్కలను పక్కాగా తేల్చాలని డిసెంబర్‌ నెలాఖరుకు డెడ్‌లైన్‌ విధించింది. ఈ దిశగా రెవెన్యూ, సర్వేశాఖల అధికారులు,సిబ్బంది పావులు కదుపుతున్నారు.

జిల్లాలో భూముల రీ సర్వేను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలై నంత త్వరలోనే మొదటి, రెండో విడతల్లో పైలైట్‌ గ్రామాలుగా చేపట్టిన 82 గ్రామాల్లో భూముల సమాచారాన్ని పక్కాగా ఉంచాల్సిం దేనంటే ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు మూడో విడతలో విభిన్నంగా ప్రతీ మండలం లోని ప్రస్తుతం మిగిలిన గ్రామాలన్నింటిల్లోనే ’సర్వే చేస్తారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో భూముల సరిహద్దుల గుర్తింపును నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొ ్నారు. ఆ తర్వాత ప్రభుత్వ భూములు, అటు తర్వాత మిగిలిన పట్టాల భూముల లెక్క లను డిసెంబర్‌ నాటికి తేల్చాలని లక్ష్యాలను నిర్దేశించింది. మొత్తం మీద ఏడాది కాలం లోనే భూముల అన్ని సమస్యలకు ప్రభుత్వం చెక్‌పెట్టేలా అడుగులు వేస్తోంది. తొలి విడ తగా పైలట్‌ ప్రాజెక్టుగా భూముల రీ సర్వే ప్రక్రియకు ఈ ఏడాది జనవరి 26న అంకురార్పణ జరిగింది. గత ప్రభుత్వ తప్పి దాలను సవరిస్తూ రైతులకు సత్వర ప్రయో జనం చేకూర్చే దిశగా ఇప్పటికే రెండు విడత లుగా జరిగిన భూముల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వ భూపరిపాలనశాఖ అదనపు కమిష నర్‌ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల చూసి వెళ్లారు. మూడో విడతను ప్రారంభించాలని ఆదేశిం చగా, ఆ దిశగా మిగిలిన అన్ని గ్రామాల్లో సరిహద్దులు గుర్తింపుపై కసరత్తులు చేపడు తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన తప్పిదాలతో ఇటీవల జాయింట్‌ ఎల్‌పీఎంల వల్ల రైతులు క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. వాటిని సరి చేయ డంతో మూడో విడతకు కార్యరంగంలోకి రెవె న్యూ, సర్వేశాఖల అధికారులు గ్రామాల వైపు తొంగి చూస్తున్నారు. దీంతో ఒక్కొక్కటిగా గ్రామాల్లో భూముల వ్యవహారాల్లో తప్పులు, లోటుపాట్లు, ఇక్కట్లను ప్రభుత్వశాఖలు సమన్వయంతో సరిచేస్తున్నారు. కాగా ప్రభు త్వ సూచనలతో భూముల రీసర్వేలో సాంకే తిక పరిజ్ఞానం ఉపయోగించి భూముల వరీ కరణకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక మ్యాప్‌ లతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలకు వెళ్లాలని భూముల రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉండాలని సీసీఎల్‌ఏ సూచనలు చేస్తూనే ఉన్నారు.

146 గ్రామాల్లో ప్రారంభించాం..

‘జిల్లాలో మూడో విడత భూముల రీ సర్వే కింద 258 గ్రామాల్లో సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 146 గ్రామాల్లో ప్రారంభించాం. మొత్తం 146 గ్రామాల్లో పూర్తి చేశాం’ అని ఏలూరు జిల్లా ల్యాండ్‌ సర్వేశాఖ ఏడీ అన్సారీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వ భూముల లెక్కింపును నవంబరు 30 నాటికి పూర్తి చేస్తామన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:42 AM