Share News

నరకయాతన!

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:52 AM

కుక్కునూరు–భద్రాచలం, కుక్కునూరు– అశ్వారావుపేట ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి గోతులమ యంగా మారింది. గత దశాబ్ద కాలంగా ప్రజలు ఈ రహదారిలో అష్ట కష్టాలు పడుతున్నారు.

 నరకయాతన!

అధ్వానంగా కుక్కునూరు–భద్రాచలం, కుక్కునూరు – అశ్వారావుపేట రోడ్డు.. రూ.14.50 కోట్ల బిల్లులు పెండింగ్‌

పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్‌.. ప్రజల ఇక్కట్లు

కుక్కునూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కుక్కునూరు–భద్రాచలం, కుక్కునూరు– అశ్వారావుపేట ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి గోతులమ యంగా మారింది. గత దశాబ్ద కాలంగా ప్రజలు ఈ రహదారిలో అష్ట కష్టాలు పడుతున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపుల్లో జాప్యం, ఇతర సమస్యల వల్ల పనులు పూర్తి కావడం లేదు. ఈ రహ దారికి మోక్షం ఎప్పుడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 40 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మించడానికి రూ.33 కోట్లు నిధులు మంజూరు చేసింది. అయితే ఆరు కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసిన అనంతరం కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపుల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాదాపు రూ.రెండున్నర కోట్ల బిల్లు చెల్లింపు జరగకపోవడంతో కాంట్రా క్టర్‌ పనులు నిలిపివేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో పెండింగు బిల్లు క్లియర్‌ అయ్యిం ది. దీంతో కాంట్రాక్టరు మరల రహదారి నిర్మాణ పనులు చేపట్టాడు. రహదారిని తవ్వి రెడ్‌మిక్స్‌తో నింపి ఒక లేయర్‌ బీటీ పనులు పూర్తయ్యాయి. మళ్లీ బిల్లు చెల్లింపులు నిలిచిపోవడంతో రహదారి నిర్మాణ పనులు మరల ఆగిపోయాయి.

రూ.14.50 కోట్లు బిల్లులు పెండింగ్‌

ఈ రహదారికి మొత్తం రూ.33 కోట్లు నిధులు మంజూరు కాగా ఇప్పటి వరకు కాంట్రాక్టరు చేసిన పనికి రూ.8.50 కోట్లు బిల్లులు చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.14.50 కోట్లు బిల్లులు పెండింగులో ఉన్నట్టు తెలిసింది. ఒక లేయర్‌ బీటీ పనులు పూర్తికాగా దాని పైన మరో లేయర్‌ బీటీ వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ బిల్లు రాలేదని ఆరునెలలుగా పనులు నిలిపివేశాడు.

గోతులమయంగా రోడ్డు

వర్షాకాలంలో కురిసిన వర్షాలకు రహదారి మళ్లీ చాలాచోట్ల పూర్తి స్థాయిలో దెబ్బతిని గోతుల మయంగా మారింది. గోతుల్లో నీరు నిలబడి వాహనం ఎటువైపు నుంచి నడపాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు పలుచోట్ల దిగబడడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోతులు తప్పించుకుంటూ ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాలు జరిగాయి. రాజమండ్రి నుంచి భద్రాచలం వైపు, భద్రాచలం నుంచి రాజమండ్రి వైపు నిరంతరం బస్సులు, ప్రైవేటు వాహనాలు ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తుంటాయి. కుక్కునూరు నుంచి భద్రాచలం వరకు నిత్యం టాటా మ్యాజిక్‌, కార్లు కిరాయికి తిరుగుతుం టాయి. అధ్వానంగా ఉన్న రోడ్డుతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతు న్నారు. బిల్లు చెల్లింపులు జరిగితేనే మళ్లీ రహదారి నిర్మాణం పూర్తయ్యేలా కనిపిస్తుంది.

నరకం కనిపిస్తోంది..

శ్రీను, కుక్కునూరు

నేను ప్రతీరోజు భద్రాచలం వరకు టాటా మ్యాజిక్‌ వాహనాన్ని కిరాయికి తిప్పుతుంటాను. గతేడాది రోడ్లు పనులు ప్రారంభం కాగానే ఇక మా బాధలు తీరుతాయని ఆశించాం. కానీ నిర్మాణం పూర్తికాకపోవడంతో గోతుల్లో వాహనాలు నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలి.

Updated Date - Dec 16 , 2025 | 12:52 AM