దానగూడెం ఘటనలో కొల్లి బాబ్జి అరెస్టు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:19 AM
దానగూడెం దళితులపై దాడి సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కైకలూరు జనసేన నాయకుడు కొల్లి వీరవెంకట సత్య వరప్రసాద్ అలియాస్ బాబ్జి మంగళవారం ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ముందు లొంగిపోయాడు.
ఏలూరు క్రైం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):దానగూడెం దళితులపై దాడి సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కైకలూరు జనసేన నాయకుడు కొల్లి వీరవెంకట సత్య వరప్రసాద్ అలియాస్ బాబ్జి మంగళవారం ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ముందు లొంగిపోయాడు. కైకలూరులో ఈనెల 5న రాత్రి వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా దానగూ డేనికి చెందిన పైయెద్దు అజయ్ (19) మరికొందరిపై దాడి చేశారు. కేసు నమోదు చేసిన కైకలూరు టౌన్ పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. 7వ నిందితుడిగా ఉన్న కైకలూరు కొల్లేటి కోటకు చెందిన బాబ్జి ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోవడంతో అతడిని కైకలూరు పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. బుధవారం కైకలూరు కోర్టులో హాజరుపర్చనున్నారు.