Share News

కొల్లేటికోట.. భక్తజన సంద్రం

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:28 AM

కొల్లేటికోటలో పెద్దింట్ల మ్మగా పిలవబడే జలదుర్గ అమ్మవారికి, గోకర్ణపురంలోని గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలిరావడంతో సోమవారం ఆలయం కిక్కిరిసింది.

కొల్లేటికోట.. భక్తజన సంద్రం
అమ్మవారికి సమర్పించిన కలువబోనాలు

జలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు

వైభవంగా ప్రభల ఊరేగింపు

కైకలూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కొల్లేటికోటలో పెద్దింట్ల మ్మగా పిలవబడే జలదుర్గ అమ్మవారికి, గోకర్ణపురంలోని గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలిరావడంతో సోమవారం ఆలయం కిక్కిరిసింది. అర్థరాత్రి 2.16 గంటల కు స్వామి, అమ్మవార్ల కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. తొలుత గోకర్ణపురం నుంచి కొల్లేటికోటకు గోకర్ణేశ్వర స్వామిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలనంతరం కల్యాణతంతు మొదలైంది. పందిరిపల్లిగూడెం గ్రామస్థులు ఏర్పా టుచేసిన భారీప్రభ ఊరేగింపులో కూటమి నేతలు ప్రత్యేక పూ జలు చేశారు. 20 వేల మంది పైబడి భక్తులు పాల్గొన్నారు. పందిరిపల్లిగూడెం, గుమ్మళ్ళపాడు, శృంగవరప్పాడు, గోకర్ణపురం, పైడిచింతపాడు నుంచి వంద లాది మంది మహిళలు కలువ బోనాలతో ఊరేగింపుగా తరలివ చ్చారు. కల్యాణ ఏర్పాట్లను ఆల య ఈవో కూచిపూడి శ్రీనివాసు పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు దంపతులు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, టీడీపీ నాయకులు బీకేఎం నాని, పూల రామచంద్రరావు, బలే ఏసురాజు, పెన్మెత్స త్రినాథరాజు, సర్పంచ్‌ బలే వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:28 AM