కొల్లేరు పరిరక్షణకు ప్రత్యేక అథారిటీ
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:22 AM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు పరి రక్షణ, పర్యవేక్షణ, సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం 24మంది సభ్యులతో ప్రత్యేక అథారిటీని నియమించింది.
26 మందితో రాజ్యాంగబద్ధ కమిటీ
చైర్మన్‌గా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ
సుప్రీంకోర్టులో వాదనల నేపథ్యంలో ప్రాధాన్యత
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు పరి రక్షణ, పర్యవేక్షణ, సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం 24మంది సభ్యులతో ప్రత్యేక అథారిటీని నియమించింది. సుప్రీంకోర్టులో ‘కొల్లేరు అంశం’ పై త్వరలో వాదనలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇకపై కొల్లేరు పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అథారిటీ లోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాల్సి వుంటుంది. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం రామ్సార్ స్థలంగా గుర్తింపు పొందిన ఈ సరస్సును అభివృద్ధి చేసేం దుకు చిత్తడి నేలల చట్టంలో చేర్చారు. 2.5 హెక్టార్లకంటే ఎక్కువ భూమి వెట్‌ల్యాండ్‌లో ఉం టే దానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేయా లి. దీంతో కొల్లేరు సరస్సులో ప్లస్ కాంటూరు వరకు కొల్లేరు అభయారణ్యం, సరస్సు నిర్వహణ కు ప్రత్యేక అఽథారిటీని నియమించాలని నేషనల్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీఎల్) 2023 జూన్ 23న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రాజ్యాంగ బద్ధ అథారిటీకి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గాను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎఫ్‌ఎస్‌టీ శాఖకు చెందిన ఒకరు వైస్ చైర్మన్ గా ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులను మంగళ వారం జారీచేశారు.
మరో 24 మంది సభ్యులు వీరే
వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లాలోని అధికారులను సభ్యులుగా చేర్చారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫిషరీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెం ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫ్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేట ర్ ఆఫ్ ఫారెస్టు, హెడ్ ఆఫ్ ఫారెస్టు ఫోర్స్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వైల్డ్‌లైఫ్) (మెంబర్ కన్వీనర్), వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఫిషరీస్ డైరెక్టర్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, టూరిజం శాఖ డైరెక్టర్, వైస్ చైర్మన్, ఆంధ్రప్రదే శ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఏపీఎస్‌ఏసీ), మెం బర్ సెక్రటరీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, చీఫ్ ఇంజనీర్ వాటర్ రిసోర్సెస్, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, మెంబర్ సెక్రటరీ, ఏపీ స్టేట్ బయోడైవర్శిటీ బోర్డు(గుంటూరు), బొంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ప్రతినిధి, హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ఆఫ్ జువాలజీ అండ్ ఫిషరీస్, ఏలూరు సర్ సీఆర్‌ఆర్ మహిళా కళాశాల, మెంబర్ కన్వీనర్ నామినేట్ చేసిన ఎన్జీవో, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(రాజమండ్రి సర్కిల్), డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్, ఏలూరు), సైంటిస్ట్ వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రడూన్‌లు సభ్యులుగా ఉంటారు.
బోర్డు నుంచి అథారిటీ వరకు
1983లో ఏర్పాటు చేసిన కొల్లేరు డెవలప్ మెంట్ అభివృద్ధి బోర్డు చైర్మన్‌గా టీడీపీకి చెందిన కమ్మిలి విఠల్ పనిచేశారు. అది కొంత కాలం పనిచేశాక ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.
1999లో కొల్లేరులోని 77 వేల 138 ఎకరా ల భూమిని అభయారణ్యం పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో 120 జారీ
2002 చిత్తడి నేలల చట్టంలోకి చేరింది.
2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేశారు.
తాజాగా 24 మంది సభ్యులతో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశారు.
అథారిటీ ముఖ్య బాధ్యతలు
కొల్లేరు సరస్సు పరిరక్షణ, అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన.
పర్యావరణ కాలుష్యం నియంత్రణ, నీటి నాణ్యత మెరుగుదలకు కృషి చేయడం.
చేపల వైవిధ్యం రక్షణ, సుస్థిర మత్స్యాభివృద్ధికి పాటుపడడం.
పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు సమగ్ర ఆదాయ అవకాశాలకు అన్వేషించడం.
జీవ వైవిధ్యం సంరక్షణ, నీటి ప్రవాహ వ్యవస్థ పునరుద్దరించడం.
కొల్లేరుపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశం జరిపి పురోగతి సమీక్షించాలి.