అలా గండ్లు కొడితే..ఇలా పూడ్చేస్తున్నారు..!
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:38 AM
ఉప్పుటేరు వెంబడి అక్రమ చేపల, రొయ్యల చెరువులను అధికారు లు ఎక్స్‌కవేటర్లతో తొలగిస్తున్నారు.
కలిదిండి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉప్పుటేరు వెంబడి అక్రమ చేపల, రొయ్యల చెరువులను అధికారు లు ఎక్స్‌కవేటర్లతో తొలగిస్తున్నారు. కొందరు ఉప్పుటేరు వెంబడి ఉన్న మార్జిన్‌లో చెరువులు తవ్వి చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. అధికారులు ఆక్రమణ దారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి చెరువుల వద్ద ఎర్ర జెండాలను పాతి మార్కింగ్ ఇచ్చి ఆపై గండ్లు కొడుతున్నారు. దీంతో చెరువుల్లో చేపలను, రొయ్యలను హడావుడిగా పట్టుబడి చేస్తున్నారు. చినతాడి, విభరాం గ్రామాల్లో రెండు ఎక్స్‌కవేటర్లతో అక్రమ చెరువులకు గండ్లు కొడుతున్నారు. తాడినాడ, సున్నంపూడి, దుంపలకోడు దిబ్బ కొండంగి, పల్లి పాలెం, మట్టగుంట, పెదలంక గ్రామాల్లో ఆక్రమణల తొలగింపునకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ చెరువుల్లో అధికంగా పండుగప్ప సాగు చేస్తు న్నారు. పట్టుబడి రాకపోవడంతో ఏమీ చేయాలో దిక్కు తోచక తలలు పట్టుకుంటున్నారు. చిన్న సైజు రొయ్యలు, చేపలను ఎలా అమ్ము కోవాలంటూ ఆందో ళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా చినతాడినాడలో ఉప్పుటేరు వెంబడి అక్రమ చెరువులను పూర్తిగా తొల గించకుండా గట్లకు చిన్న గండి పెట్టడంతో మరుసటి రోజు మళ్లీ ఆక్రమణదారులు పూడ్చివేసి యథావిధిగా సాగు చేసుకుం టున్నారనే విమ ర్శలు వినిపి స్తున్నా యి. ఈవిషయమై డ్రెయినేజీ శాఖ డీఈఈ వినోద్ చంద్ ను వివరణ కోరగా.. ‘గండ్లు మరల పూడ్చు తు న్నట్టు మా దృష్టికి వచ్చింది. చెరువుల గండ్లు పూడ్చిన వారిపై కేసులు పెడతాం. పూడ్చిన గండ్లు, చెరువులను పూర్తిగా తొలగిస్తాం’ అన్నారు.