కమనీయం.. కావిడి ఉత్సవం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:24 AM
సుబ్రహ్మణ్యం మాం పాహి...స్వామినాథ మాం పాహి... అంటూ భక్తులు కావిడిలను ధరించి శ్రీవారి క్షేత్రంలో గురువారం తిరుగాడారు.
ద్వారకాతిరుమల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యం మాం పాహి...స్వామినాథ మాం పాహి... అంటూ భక్తులు కావిడిలను ధరించి శ్రీవారి క్షేత్రంలో గురువారం తిరుగాడారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్ర దత్తత దేవాలయమైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కల్యాణోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగిన కావిడి ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. సంప్రదాయబద్ధంగా పంచె, కండువా ధరించి ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో కావిడిలను అందించారు. అనంతరం వారు సుబ్రహ్మణ్యుడి చిత్రపటంతో క్షేత్రంలో తిరుగగా వారి పాదాలను భక్తులు కడిగి భక్తిభావాలను చాటారు. బాలలు సైతం ఇందులో పాల్గొనడం విశేషం. కాగా వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు నెమలి వాహనంపై కొలువుతీరి గురువారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు.