Share News

శివోహం

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:55 AM

కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

శివోహం
ముస్తాబైౖన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం

నేటి నుంచి కార్తీక మాసం

ముస్తాబైన శివాలయాలు

విద్యుత్‌ దీపాలతో అలంకరణ

ప్రత్యేక పూజలు, అభిషేకాలు

భక్తులకు ఏర్పాట్లు

భీమవరం టౌన్‌/ద్వారకాతిరుమల/గణపవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పాఢ్యమి తిధి సూర్యోదయ సమయానికి ఉన్న రోజైన బుధవారం నుంచి కార్తీక స్నానాలు ఆచరించవచ్చని పండితుల మాట. నెలంతా పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, వనభోజనాలు, ఆధ్యాత్మిక భక్తిపారవశ్యంలో మునిగి పోతారు. శివనామస్మరణలతో ఆలయాలు మార్మోగు తాయి. వేకువజామునే చన్నీటి స్నానాలు, దీపారా ధన, శివారాధనతో భక్తులు పరవశిస్తుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ప్రత్యేకంగా మహిళలు ఎంతో నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీక పురాణ పఠనం చేస్తూ శివకేశవులను ఆరాధిస్తారు. కార్తీక పురాణంలో శివారాధన, దీపా రాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్తీకమాస నెల రోజుల్లో సోమవారాలు, జ్వాలాతోరణం, శివుని ప్రాముఖ్యతను చాటితే బలిపాఢ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజుల శ్రీమహావిష్ణువును పూజిస్తారు. కార్తీక పురాణాల్లో మొదటి 15 అధ్యాయాలు శివుని, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి ఉంటుంది.

పరమ పవిత్రం కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమి నాడు నదీస్నానం చేసి శివయ్యను విశేషంగా పూజిస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి ఆ పరమశివుని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదులు, పారే నీటిలో వదులుతారు. సోమవారాలు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. కార్తీకంలో దీపారాధన ఎంతో మహి మాన్వితమైది అని నమ్ముతారు.

ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

కార్తీక మాసం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలోని శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచా రామ క్షేత్రాలైన గునుపూడి సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో అధికారు లు ఏర్పాట్లను పూర్తిచేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు, విద్యుత్‌ దీపాలంకరణ ఏర్పాటుచేసారు. ఆచంట రామలింగేశ్వరస్వామి దేవస్థానం, నత్తారామేశ్వరం రామలింగేశ్వరస్వామి, జుత్తిగ ఉమా వాసుకీ రవి సోమేశ్వరస్వామి, పెనుగొండ నగరేశ్వరస్వామి, యనమదుర్రు శక్తీశ్వరస్వామి, సి ద్ధాంతం, తణుకు, తాడేపల్లిగూడెం ఆలయాలు, ద్వార కాతిరుమల చిన్న వెంకన్న క్షేత్ర పాలకుడు మల్లికా ర్జునస్వామి, జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం, పట్టిసీమ క్షేత్రం, తదితర శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు.

Updated Date - Oct 22 , 2025 | 12:55 AM