కాలువల అభివృద్ధితో సురక్షితమైన తాగునీరు
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:15 AM
:కాలువల అభివృద్ధితో ప్రజలకు సురక్షితమైన తాగునీరును అందిస్తామని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు అన్నారు.
కైకలూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి):కాలువల అభివృద్ధితో ప్రజలకు సురక్షితమైన తాగునీరును అందిస్తామని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు అన్నారు. కైకలూరు పంట కాలువకు గురువారం నీరు విడుదలైన సందర్భంగా కైకలూరు–కోరుకొల్లు రోడ్డులోని వంతెన వద్ద కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో డీసీ చైర్మన్ పొత్తూరి వాసురాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఒక్క కాలువను అభివృద్ధి చేయక పోవడంతో అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రస్తుతం కాలువలను అభివృద్ధి చేయడం వల్ల ఎగువనుంచి నీరు పుష్కలంగా వస్తోందని, శివారు గ్రామాలకు సైతం సరఫరా చేస్తామని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు మంచినీటి చెరువులు నింపేందుకు సహకరించాలన్నారు. ఎంపీపీ అడవి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు, కూటమి నేతలు పూల రాజీ, కేకే బాబు, ఎండీ జాని, కీర్తి వెంకటరాంప్రసాద్, కేవీఎన్‌ఎం నాయుడు, గంగుల ఏసురాజు, పడమటి వాసు, అధికారులు పాల్గొన్నారు.