‘బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం’
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:16 AM
‘చదువుకునే వయస్సులో చదువు మీద మాత్రమే ఏకాగ్రత కలిగి ఉండాలని, ఇతర ఆకర్షణలకు లోనైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని, బాల్య వివాహాలు చేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని’ భీమవరం 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్.జ్యోతి అన్నారు.
భీమవరం క్రైం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : ‘చదువుకునే వయస్సులో చదువు మీద మాత్రమే ఏకాగ్రత కలిగి ఉండాలని, ఇతర ఆకర్షణలకు లోనైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని, బాల్య వివాహాలు చేసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని’ భీమవరం 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్.జ్యోతి అన్నారు. ఈనెల 24 నుంచి 30 వరకు బాల్య వివాహాలపై అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆదిత్య జూనియర్ కాలేజీలో మెజిస్ట్రేట్ అధ్యక్షతన న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్ (న్యూటన్), 2వ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.కాళీచరణ్, ప్యానల్ న్యాయవాదులు బి.సురేష్ కుమార్, పి.అంబేడ్కర్, మీడియేషన్ న్యాయవాది కె.విజయలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మీకాంతమ్మ, పీహెచ్‌సీ డాక్టర్ చాందిని, ఎస్‌టీ హాస్టల్ వార్డెన్ డి.శ్రీనివాస్, కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పి.మధురాజు, వైస్ ప్రిన్సిపాల్ టి.తిరుపతిరెడ్డి, కాలేజీ ఏవో భీమారావు, తదితరులు పాల్గొన్నారు. సీఐ కాళీచరణ్ శక్తి యాప్‌పై విద్యార్థినులకు వివరించి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా ప్రమాదంలో ఉంటే సెల్‌ఫోన్‌ను మూడుసార్లు చేతితో అడ్డంగా ఊపితే సంబంధిత పోలీస్‌లకు సమాచారం వెళుతుందని, సత్వరమే వచ్చి రక్షిస్తారన్నారు.