Share News

చిన్నాను కలవకపోతే.. పనులెలా పెడతాం!

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:46 AM

‘వర్కులు కావాల్సిన మున్సిపల్‌ కౌన్సిలర్లంతా మా ఇంటికి వచ్చి వారి వార్డులో పనులు పెట్టించుకుం టున్నారు.. మీరు మాత్రం రారు. చిన్నా గారిని అడగరు.. చిన్నా గారిని అడగకపోతే మీకు పను లెలా పెడతాము అనుకుంటున్నారు’.. అని మునిసి పల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి నాల్గొవ వార్డు కౌన్సిలర్‌ వలవల తాతాజీ (జనసేన)ను ఉద్దేశించి శనివారం జరిగిన జంగారెడ్డిగూడెం కౌన్సిల్‌ సమా వేశంలో వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం చెల రేగింది.

 చిన్నాను కలవకపోతే..  పనులెలా పెడతాం!
చైర్‌పర్సన్‌ పోడియం ఎదుట బైఠాయించిన కౌన్సిలర్‌ వలవల తాతాజీ

తీవ్ర దుమారం రేపిన చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి వ్యాఖ్యలు

రసాభాసగా జంగారెడ్డిగూడెం కౌన్సిల్‌ సమావేశం

జంగారెడ్డిగూడెం,నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘వర్కులు కావాల్సిన మున్సిపల్‌ కౌన్సిలర్లంతా మా ఇంటికి వచ్చి వారి వార్డులో పనులు పెట్టించుకుం టున్నారు.. మీరు మాత్రం రారు. చిన్నా గారిని అడగరు.. చిన్నా గారిని అడగకపోతే మీకు పను లెలా పెడతాము అనుకుంటున్నారు’.. అని మునిసి పల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి నాల్గొవ వార్డు కౌన్సిలర్‌ వలవల తాతాజీ (జనసేన)ను ఉద్దేశించి శనివారం జరిగిన జంగారెడ్డిగూడెం కౌన్సిల్‌ సమా వేశంలో వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం చెల రేగింది. సమావేశం రసాభాసగా మారింది.

చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే వైస్‌ చైర్మన్‌ ముప్పిడి వీరాం జనేయులు ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు ఫ్ల కార్డు లు చేతపట్టుకుని ప్రభుత్వం ఫ్రీజ్‌ చేసిన రూ.8.5 కోట్ల మున్సిపల్‌ సాధారణ నిధులను వెంటనే విడు దల చేయాలని నినదిస్తూ సభ హాలులోకి వచ్చా రు. సమావేశం ప్రారంభమైన తరువాత నాల్గొవ వార్డు కౌన్సిలర్‌ వలవల తాతాజీ మాట్లా డుతూ గత నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో తన వార్డులో ప్రధాన డ్రెయిన్‌ నిర్మాణానికి టేబుల్‌ అజెండాలో పెట్టిన రూ.35 లక్షల వర్కు తీర్మానం అయిన తరువాత ఎందుకు రద్దు చేశారో చెప్పా లంటూ చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. దీనికి చైర్‌ పర్సన్‌ సమాధానమిస్తూ గత సమావేశానికి అధ్య క్షత వహించిన వైస్‌ చైర్మన్‌ ముప్పిడి వీరాంజ నేయులు తమకు తెలియకుండా టేబుల్‌ అజెండా లో పెట్టారని, అందుకనే రద్దు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త చిన్నాను వర్కు అడిగిన కౌన్సిలర్లందరికీ వర్కులు మంజూరు చేస్తున్నారు.. మీరు మా ఇంటికి రానందువల్లే మీకు వర్కులు పెట్టడం లేదంటూ సమాధానమిచ్చారు. దీంతో కౌన్సిలర్‌ తాతాజీ చైర్‌పర్సన్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ పోడియం ముందు బైఠాయించారు. ‘ నేనేమీ నా సొంత పని అడగడం లేదు.నా వార్డు ప్రజలకోసమే అడుగు తున్నా. నా వార్డులో డ్రెయిన్‌ నిర్మాణానికి నిధులు కేటాయిస్తే కానీ పోడియం వద్ద నుంచి లేవను’ అంటూ పట్టుబట్టారు. కమిషనర్‌ కెవి.రమణ, పలు వురు కౌన్సిలర్లు ఆయనకు నచ్చచెప్పడానికి ప్రయ త్నించారు. అనంతరం చైర్‌పర్సన్‌ ఆదేశాల మేరకు టేబుల్‌ అజెండాలో నాల్గొవ వార్డు డ్రెయిన్‌ నిర్మా ణానికి రూ.35 లక్షలు నిధులు కేటాయించగా కౌన్సిల్‌ సభ్యులు అమోదించారు. సభ ప్రారంభానికి ముందు పట్టణం గ్రేడ్‌–1 మునిసిపాలిటీ కావడానికి కారణం మేమంటే మేమంటూ టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు వాదులాడుకున్నారు. కేవలం ఎమ్మెల్యే, ఎంపీల సహకారం తోనే గ్రేడ్‌–1 మున్సిపాలిటీ అయ్యిందని కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి తేల్చిచెప్పారు.

Updated Date - Nov 30 , 2025 | 12:46 AM