Share News

సార్వా జోష్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:36 AM

ముందస్తు సాగు ప్రణాళిక ఫలించింది. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది సార్వా సాను కూలంగా మారింది.

సార్వా జోష్‌

ధాన్యం కొనుగోలుకు అధికారుల ఏర్పాట్లు

ఈసారి దిగుబడి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల అంచనా

వచ్చేనెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు

భీమవరం రూరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ముందస్తు సాగు ప్రణాళిక ఫలించింది. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది సార్వా సాను కూలంగా మారింది. ఇప్పటికే మెట్ట ప్రాంతంలో పంట మాసూళ్లు పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా వస్తున్నాయి. డెల్టాలో కూడా అధికదిగుబడులు వచ్చేలా చేలు కనిపిస్తున్నాయి. దీంతో చాలా సంవత్సరాల తరువాత సార్వా పంటలో మెరుగైన దిగుబడులు అందుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే జిల్లా అఽధికార యంత్రాంగం పంట మాసుళ్లు అయిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసేందుకు మండలస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ మాసుళ్లు జరిగేతే ఆ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ళు విషయంలో కొత్త విధానం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం . జిల్లాలో ఈ సార్వాలో 2 లక్షల 11 వేల ఎకరాల్లో సాగు జరిగింది. దానిలో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో 12 వేల ఎకరాలల్లో పంట మాసుళ్లు జరుగుతున్నాయి. మిగిలిన సాగు పొట్ట, చిరుపొట్ల దఽశల్లో ఉన్నాయి. గతంలో కంటే నెల ముందుగానే మాసూళ్లకు వస్తాయని రైతులు చెబుతున్నారు.

40 నుంచి 45 బస్తాల దిగుబడి

సార్వా పంట అంటే లాభాల మాట ఎలా ఉన్నా నష్టాలే వస్తుంటాయి. గడిచిన ఐదేళ్లుగా రైతులు వర్షాలకు ముంపు బారిన పడి నష్టపోతూనే వచ్చారు. ఈసారి సార్వాకు అనుకూలించింది. అధిక దిగుబడులు ఇచ్చేలా చేలు తయార య్యాయి. మెట్ట ప్రాంతంలో పంట మాసూళ్లు జరిగే ప్రాంతంలో ఎకరానికి పీఆర్‌ 126 రకం 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తోంది. స్వర్ణ రకం 40 బస్తాల వరకు పండింది. డెల్టా ప్రాంతంలో కూడా 35 బస్తాలు పైబడి దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు బట్టి అంచనా వేస్తున్నారు.

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

ఈసారి సార్వాకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసింది. మెట్ట ప్రాంతంలో వచ్చేనెల మొదటి వారంలో తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. మాసూళ్లు అవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన సంచులు, కొనుగోళ్లకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో రైతుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చెయ్యడంతో పాటు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆర్‌ ఎస్‌కె వద్ద మిల్లర్లకు, రైతులతో సమావేశాలు ఏర్పాట్లు చేసి అవగాహన కల్పించనున్నారు. ఆర్‌ఎస్‌కె వద్ద క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సమస్యలను రైతులు అధికారులకు తెలపటానికి వీలు కలుగుతుంది.

ముందు పంటకొచ్చే రకాలతో మేలు

ఈ ఏడాది సార్వా పంటలో ముందస్తుగా నారుమళ్లతో పాటు తక్కువ కాలంలో పండే రకాలను రైతులు ఎంచుకున్నారు. 150 రోజల రకం 1121 తగ్గించి 120 రోజులు వచ్చే ఐఆర్‌–126, 1318, సంపద స్వర్ణ, 1150 రకాలను సాగు చేశారు. వర్షాలు లేకపోవడం ఈ రకాలకు మేలు జరిగింది. అధిక దిగుబడులు ఇచ్చేలా చేలు తయార య్యాయి. అక్టోబరు మొదటి వారంలోనే పంట మాసూ ళ్లయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రకాలు కూడా 30 బస్తాల నుంచి 40 బస్తాలు వస్తున్నందున ఈ సార్వాలో రైతులకు మేలు జరగనున్నది.

Updated Date - Sep 20 , 2025 | 12:36 AM