Share News

పాఠాలు బాగా చెబుతున్నారా?

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:22 AM

పాఠశాలల్లో బోధన, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రతపై జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి విద్యార్థులను ఆరా తీశారు.

పాఠాలు బాగా చెబుతున్నారా?
విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

విద్యార్థులను ప్రశ్నించిన జేసీ

అత్తిలి, జూలై 1(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో బోధన, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రతపై జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి విద్యార్థులను ఆరా తీశారు. అత్తిలి జడ్పీ బాలికల పాఠశాలను మంగ ళవారం ఆయన పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యా యులు పాఠాలు బాగా చెబుతున్నారా? పాఠశాల ఆవరణ ఎలా ఉంది? మౌలిక సదుపాయాలు, ఆట స్థలం, మధ్యాహ్న భోజనంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా హిందీ పదాలు నేర్పించాలని హిందీ ఉపాధ్యాయుడు సూచించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి మెనూ ప్రకారం వంటలు చేయాల ని ఎండీఎం వర్కర్లకు సూచించారు. భోజనాన్ని విద్యార్థులకు ఆయన స్వయంగా వడ్డించారు. ఎంఈవోలు రమేష్‌, ప్రసాద్‌, హెచ్‌ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటి స్థలాలకు అర్హులను గుర్తించండి

ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిం చాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్తిలిలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి జేసీ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించడం పై వీఆర్వోలకు సూచనలు ఇచ్చారు. అత్తిలిలో 450 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తహసీల్దార్‌ వంశీ జేసీకి వివరించారు.

Updated Date - Jul 02 , 2025 | 12:22 AM