పరిశుభ్రత ఏదీ?
ABN , Publish Date - May 23 , 2025 | 12:37 AM
మావుళ్లమ్మ ఆలయం వెనుక పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం తో మునిసిపాలిటీ ప్రత్యేకాధికారి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
అధికారులపై జేసీ అసహనం
భీమవరం టౌన్, మే 22 (ఆంధ్రజ్యోతి): మావుళ్లమ్మ ఆలయం వెనుక పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం తో మునిసిపాలిటీ ప్రత్యేకాధికారి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులతో కలసి గురువారం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ వెనుక సిమ్మెంట్ రోడ్డు వద్ద చెత్త, డ్రైన్‌లు పరిశుభ్రంగా లేకపోవటాన్ని గమనించి కమిషనర్‌ను కె.రామచంద్రారెడ్డిని ప్రశ్నించారు. శానిటరీ ఇన్ స్పెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేశ్‌కు సూచనలు ఇచ్చారు. మునిసిపల్ కార్యాలయంలో అధికారులతో స మావేశమై అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కమిషనర్ రామచంద్రారెడ్డి, ఎం.త్రినాథ్‌కు సూచనలు ఇచ్చారు.