Share News

సచివాలయ ఉద్యోగులకు జాబ్‌ చార్ట్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:48 AM

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేస్తోంది. ఇప్పటికే డివిజన్‌ స్థాయిలో డీడీవో కార్యాలయాలను ఏర్పాటు చేసింది.

సచివాలయ ఉద్యోగులకు జాబ్‌ చార్ట్‌

జిల్లాలో 495 గ్రామ, 110 వార్డు సచివాలయాలు

సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేస్తోంది. ఇప్పటికే డివిజన్‌ స్థాయిలో డీడీవో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల కు పర్యవేక్షణ అధికారులను నియమించింది. మండలాల్లో సచివాలయాలను పర్యవేక్షణ బా ధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించగా, పట్టణా ల్లో మునిసిపల్‌ కమిషనర్లే చూస్తారు. ఈ నెల 17న ఈ మేరకు ప్రభుత్వం పర్యవేక్షణాధికా రులకు బాధ్యతలను అప్పగించాలని ఆదేశించ గా, కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లాలో 27 మండలాల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీడీవోలకే బాధ్యతలను అప్పగిస్తూ జడ్పీ సీఈవో శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 495 గ్రామ సచివాలయాలు, ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, చింతలపూడి మునిసిపాల్టీలతో పాటు చింతలపూడి నగర పంచాయతీలో 110 వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయి.

గతంలో పర్యవేక్షణ గాలికే..

గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి పర్యవేక్షణ గాలికొదిలేసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారం భించింది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గ్రామ పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా మండల సచివాలయ అధికారులను నియమిం చారు. రాబోయే కాలంలో మండలాల్లో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు పనిచేస్తారు. ఒకరు పంచాయతీలు, మరొకరు సచివాలయ వ్యవహా రాలను పర్యవేక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో గ్రేడ్‌ –1 కార్యదర్శులు, సీనియర్‌ సహాయకుల్లో అర్హులకు పదోన్నతి కల్పించి పూర్తిస్థాయిలో సచివాలయ అధికారులను నియమించనున్నా రు. ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందు కు ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.

ఇక పక్కాగా విధులు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదే శాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి నిర్దిష్ట మైన చార్టును విడుదల చేసింది

గ్రామ, వార్డుస్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి.

ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి.

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దే అందించాలి.

స్థానికంగా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతర అనుశీలన చేపట్టాలి.

విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి.

ప్రభుత్వం సమయానుసారం జారీచేసే ఆదేశాలకు అనుగుణంగా వారికి అప్పగించే ఏ పనులైనా నిర్వర్తించాలి.

ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి.

ఈ జాబ్‌ చార్టు అమలు బాధ్యతలను కలెక్టర్‌ లేదా నియామక అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధులను అమలు చేయకపోతే బాధ్యులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ఎనర్జీ అసిస్టెంట్లు ఏమయ్యారు!

ఏలూరు రూరల్‌, అక్టోబరు 22(ఆంధ్ర జ్యోతి): సచివాలయాలలో ఎనర్జీ అసిస్టెంట్లు కనిపించడం లేదు.. వారు ఎక్కడున్నారో..? ఏ పనులు చేస్తున్నారో..? ప్రజలకు తెలియడం లేదు. విద్యుత్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఎనర్జీ అసిస్టెం ట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌–2)ను 2019లో నియమిం చారు. ఐదేళ్లు గడిచినా చాలామంది ఉద్యోగులు సచివాలయాల గడప తొక్కిన దాఖలాలు లేవు. జిల్లాలో 470 మంది ఎనర్జీ అసిస్టెంట్లను నియ మించారు. వారి విధులపై విద్యుత్‌ శాఖ, సచి వాలయ వ్యవస్థ ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించింది. వారు సచివాల యాల విధులకు హాజరవుతున్నారని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. అలాంటి ఉద్యోగు లను చూసింది లేదని సచివాలయ అధికారు లు అంటున్నారు. ఆ ఉద్యోగులకు మాత్రం సచివాలయ పరిధిలో పనిచేయాలా? లేక విద్యుత్‌ శాఖ పరిధిలో అన్నది ఇప్పటికీ తేల లేదు. సచివాలయ ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలు కానీ.. విద్యుత్‌శాఖ ప్రయోజ నాలు కానీ పొందలేని స్థితిలో ఉన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:48 AM