Share News

జిన్నూరు సొసైటీకి రాష్ట్రస్థాయి పురస్కారం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:53 PM

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పనితీరు కనబర్చిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరు సొసైటీకి రాష్ట్రస్థాయి అత్యుత్తమ పురస్కారం లభించింది.

జిన్నూరు సొసైటీకి రాష్ట్రస్థాయి పురస్కారం
ఉత్తమ సొసైటీ పురస్కారం, చెక్కును అందుకుంటున్న జిన్నూరు సొసైటీ చైర్మన్‌ దేవళ్ల ప్రసాదు, కార్యదర్శి పెచ్చెట్టి రామకృష్ణ

పోడూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పనితీరు కనబర్చిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరు సొసైటీకి రాష్ట్రస్థాయి అత్యుత్తమ పురస్కారం లభించింది. ఆదివారం విజయవాడ సమీపంలోని నాగార్జున యూని వర్సిటీలో ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, అడిషనల్‌ రిజిస్ర్ట్రార్‌ బి.రాజశేఖర్‌, ఆప్కాబ్‌ ఎండీ రామకృష్ణ చేతుల మీదుగా జిన్నూరు సొసైటీ చైర్మన్‌ దేవళ్ల ప్రసాదు, సొసైటీ కార్యదర్శి పెచ్చెట్టి రామకృష్ణ అవార్డును, రూ.25 వేలు చెక్కును అందుకున్నారు. సొసైటీలో ఏటా మహిళలకు పెద్దఎత్తున సంక్రాంతి రుణాలు అందించడం, రైతులకు మెరుగైన సేవలతో పాటు సంఘ కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో నిర్వహి స్తున్నారు. ఈమేరకు జిన్నూరు సొసైటీ రాష్ట్రస్థాయి ఉత్తమ సొసైటీ అవార్డును కైవసం చేసుకుంది. సొసైటీ చైర్మన్‌ దేవళ్ల ప్రసాదు మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి రైతులు, ప్రజలు, సొసైటీ సిబ్బంది అందించిన సహాయ సహాకారాలేనన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు చొప్పల రాజమణి, దొమ్మేటి రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:53 PM