Share News

వాహనదారుల భద్రతకు ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:31 AM

రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి సూచించారు.

వాహనదారుల భద్రతకు ప్రాధాన్యం
ఎన్‌హెచ్‌ అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ, జేసీ

ముదినేపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి సూచించారు. పామర్రు – దిగమర్రు 165 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భద్రతా చర్యల లోపంతో ఇటీవల ముదినేపల్లి సమీపంలో పోల్‌రాజ్‌ మేజర్‌ డ్రెయిన్‌ లోకి కారు దూసుకుపోయి రిటైర్డ్‌ సైంటిస్ట్‌ మృతి చెందారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఎస్పీ, జేసీ పరి శీలించారు. రెండో వంతెన నిర్మాణ ప్రదేశానికి రెండు వైపులా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు తీసుకుంటే ప్రమాదం జరిగేది కాద న్నారు. ఇకపై ఎటువంటి ప్రమాదం జరిగినా బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోల్‌ రాజ్‌ డ్రెయిన్‌ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవా లని నేషనల్‌ హైవే ఎస్‌ఈ, డీఈఈలను ఆదేశించారు. రెవె న్యూ, పోలీస్‌ అధికారులు కూడా పనులను పరిశీలించాల న్నా రు. అనంతరం పెదపాలపర్రు వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. రహదారి పనులతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ముదినేపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్‌హెచ్‌ అధికారులపై జేసీ ఆగ్రహం

కైకలూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా పలువురు మృతి చెందా రని, ఎవరూ మృతి చెందలేదని ఎన్‌హెచ్‌ అధికారులు, కాం ట్రాక్టర్‌ కలిసి అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ఆంధ్రజ్యోతిలో ‘అధికారుల నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణసంకటం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన జేసీ ధాత్రి రెడ్డి, ఎస్పీ కిశోర్‌ మంగళవారం లింగాల, పెరికేగూడెం, మండవల్లి గ్రామాల్లో ఎన్‌హెచ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. మండ వల్లిలో మృతి చెందిన వారి ఇంటికి తీసుకెళతామని స్థానికులు కోరడంతో జేసీ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కైకలూరు మండలం గోనెపాడు నుంచి ఉప్పుటేరు వరకు రహ దారి నిర్మాణం జాప్యంపై ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కైకలూరులో ఎన్‌హెచ్‌, రవాణా, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఎన్‌హెచ్‌ నిర్మాణ పనులపై ఎస్పీ, జేసీ సమీక్షించారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ ఈఈ జి.సంజీవరాయుడు, డీఈ సత్యనారాయణ, తహసీల్దార్లు లతీఫ్‌పాషా, ఇబ్రహీం, శరత్‌, సీఐలు రవికు మార్‌, పి.కృష్ణ, వి.రవికుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:31 AM