జల్ జీవన్‌కు జవసత్వాలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:49 AM
కూటమి ప్రభుత్వ పాలనలో జలజీవన్ పథకానికి జవ సత్వాలు వచ్చాయి.
వైసీపీ పాలనలో పూర్తి కాని పనులు
పూర్తి చేస్తున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వ పాలనలో జలజీవన్ పథకానికి జవ సత్వాలు వచ్చాయి. ఇంటింటికీ మంచినీరు అందించడమే లక్ష్యంగా 2019లో జల జీవన్ ప్రారంభించినా గత ప్రభుత్వ హయాంలో పనులు మొక్కుబడిగా చేశారు. వైసీపీ పాలనలో చివరి ఏడాది పనులు ప్రారంభించినా చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రాగానే జలజీవన్ పనులపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు ప్రారంభించని పనులను రద్దు చేసి టెండర్ విధానం ద్వారా చేపట్టాలని నిర్ణయించింది.
ఏలూరు సిటీ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జల్ జీవన్ మిషన్‌లో కేటాయించిన మొత్తం పనులు 1223. రూ.264.61 కోట్లు నిధులను మంజూరు చేశారు. ఇప్పటి వరకు 850 పనులు పూర్తికాగా 316 పనులు వివిధ దశ ల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించని 57 పనులను రద్దు చేసి టెంబర్ విధానం ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా ఏలూరులో 42, దెందులూరులో 240, ఉంగుటూ రులో 61, చింతలపూడిలో 145, పోలవరంలో 424, కైకలూరులో 112, నూజివీడులో 132, గోపాలపురంలో 67 పనులను కేటాయించారు. వాటిలో ఏలూరులో 42, దెం దులూరు 170, ఉంగుటూరు 51, చింతలపూడి 108, పోలవరం 238, కైకలూరు 90, నూజివీడు 84, గోపాల పురంలో 67 పనులు పూర్తయ్యా యి. దెందులూరులో 60, ఉంగుటూరులో 9, చింతల పూడిలో 32, పోలవరంలో 182, కైకలూరులో 18, నూజివీడులో 15 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో 35 రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితో పాటు అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్స్, వాటికి మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పనులు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి
57 పనులకు టెండర్లు
గత ప్రభుత్వ హయాంలో అసలు ప్రారంభించని 57 పనులను రద్దు చేసి టెండర్ విధానం ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఇంటింటికీ కుళాయి ఏర్పాటు లక్ష్యం
జల్‌జీవన్ మిషన్ పథకంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వడమే లక్ష్యం. జిల్లాలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలో ప్రారంభించని పనులను టెండర్ విధానం ద్వారా చేపట్టాలని నిర్ణయించాం. అందరికీ మంచినీరు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ పథకం పూర్తయితే జిల్లాలో మంచినీటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కా రమయ్యే అవకాశం ఉంది.
– జి.త్రినాథ్‌బాబు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యుఎస్