Share News

లంచం తీసుకున్న లైన్‌మన్‌కు షాక్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:58 AM

వ్యవసాయ భూమిలో వేసిన బోర్‌వె ల్‌కు ఎలక్ర్టికల్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి లైన్‌మన్‌ రూ.ఐదు వేలు లంచం తీసుకున్నట్టు నేరం రుజువు కావడంతో అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం శుక్రవారం తీర్పుచెప్పింది.

లంచం తీసుకున్న లైన్‌మన్‌కు షాక్‌

ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు

ఏలూరు క్రైం, నవంబరు 7(ఆంధ్ర జ్యోతి):వ్యవసాయ భూమిలో వేసిన బోర్‌వె ల్‌కు ఎలక్ర్టికల్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి లైన్‌మన్‌ రూ.ఐదు వేలు లంచం తీసుకున్నట్టు నేరం రుజువు కావడంతో అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం శుక్రవారం తీర్పుచెప్పింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానపల్లికి చెందిన కనుకుంట మురళీకృష్ణ అతని మామ తూమాట అజయ్‌ కుమార్‌లకు ఉన్న వ్యవసాయ భూమిలో బోరు వెల్‌ వేశారు. దానికి కనెక్షన్‌ ఇవ్వడానికి 2010లో భీమడోలు ఎలక్ర్టికల్‌ ఆఫీస్‌కు చెందిన లైన్‌మన్‌ డి.మాణి క్యాలరావు వారిని రూ.ఐదు వేలు లంచం డిమాండ్‌ చేయగా వారు ఏలూరు అవి నీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు 2010 మార్చి 31న లంచం తీసుకుంటున్న మాణిక్యాలరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయ స్థానంలో విచారణ జరగ్గా మాణిక్యాల రావుపై నేరం రుజువు కావడంతో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చింది.

Updated Date - Nov 08 , 2025 | 12:58 AM