జగ న్నాథుడి రథోత్సవం
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:01 AM
కల్కి భగవానుడిగా జగన్నాథుడు ఆదివారం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీవారి క్షేత్రానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురం ఆలయంలో జరుగుతున్న జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా జగన్నాథుడు ఖడ్గాన్ని డాలును ధరించి కల్కి అవతారంలో సాక్షాత్కరించారు
లక్ష్మీపురం ఆలయంలో ముగిసిన ఉత్సవాలు
ద్వారకాతిరుమల : కల్కి భగవానుడిగా జగన్నాథుడు ఆదివారం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీవారి క్షేత్రానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురం ఆలయంలో జరుగుతున్న జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా జగన్నాథుడు ఖడ్గాన్ని డాలును ధరించి కల్కి అవతారంలో సాక్షాత్కరించారు. గత నెల 27 నుంచి ప్రారంభమైన రథోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. జగన్నాథుని దివ్య రథోత్సవాలలో భాగంగా సుభద్ర, బలభద్ర, జగన్నాథులతో కొలువైన రథచక్రాలు ముగింపు రోజున ఆలయం నుంచి బయటకు కదిలాయి. లక్ష్మీపురం ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురం వరకు ఈ రథయాత్రను దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది. రథయాత్రను వీక్షించిన భక్తులు పరవశించారు.
రథయాత్ర ఇలా...
అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ పూరీ క్షేత్ర నుంచి తెచ్చిన సుభద్ర, బలభద్ర, సమేత జగన్నాఽథుని దారు విగ్రహాలను అట్టహా సంగా కోవెల నుంచి తెచ్చి రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై ఉంచి అలంకరించారు. అధికారుల పూజలు, బలిహరణల అనంతరం రథయాత్రను ప్రారంభించారు. మేళతాళాలు, సన్నాయి డప్పు వాయిద్యాలు, కోలాట భజనలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ రథయాత్ర తిమ్మాపురం వరకు నేత్రపర్వంగా జరిగింది.