Share News

అడవిని ఖాళీ చేయం

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:34 AM

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మోదేలు కొండరెడ్డి గ్రామాన్ని కేఆర్‌ పురం ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్‌ బుధవారం సందర్శించారు.

అడవిని ఖాళీ చేయం
మోదేలు కొండరెడ్లతో మాట్లాడుతున్న పీవో రాములు నాయక్‌

ఐటీడీఏ పీవోకు స్పష్టం చేసిన మోదేలు కొండరెడ్లు

బుట్టాయగూడెం, జూలై 30(ఆంధ్రజ్యోతి):దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మోదేలు కొండరెడ్డి గ్రామాన్ని కేఆర్‌ పురం ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్‌ బుధవారం సందర్శించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసు కున్నారు. వారిని ఇతర ప్రాంతానికి తరలించేందుకు పీవో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మోదేలు వెళ్లారు. అడవిని వదలి ఇతర ప్రాంతానికి రావాలంటే ఇక్కడ తమకున్న సదుపాయాలను కల్పించాలని, పోడు భూములు కావాలని తెలపగా ఇళ్లు తప్ప ఇతర సౌకర్యాలు కల్పించలేమని అధికారులు చెప్పడంతో ఇతర ప్రాంతానికి తరలి వచ్చేందుకు రావడానికి వారు అయిష్టత చూపించారు. కొండరెడ్లు తెలిపిన విషయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లతామని పీవో తెలిపారు. ఏపీవో ఎం.శ్రీనివాసరావు, సర్పంచ్‌ కారం లక్ష్మీ, ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, కారం రాఘవ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:34 AM