Share News

లస్కర్ల కొరత

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:53 AM

బ్రిటిష్‌ కాలం నుంచి సాగునీటి వ్యవస్థలో భాగంగా కాల్వల నిర్వ హణ సాఫీగా సాగేందుకు లస్కర్ల పాత్ర కీలకం. అయితే నాలుగు దశాబ్దాలుగా లస్కర్‌ పోస్టుల ఖాళీ అవుతున్నా.. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. దీంతో సాగునీటి నిల్వల నిర్వ హణలో లోటుపాట్ల వల్ల రైతాంగా నికి సమస్యలు ఎదురవుతున్నాయి.

 లస్కర్ల కొరత

సాగునీటి సరఫరాలో అవస్థలు

ఏళ్ల తరబడి పోస్టుల భర్తీ లేదాయె..

అరకొర సిబ్బందితోనే కాల్వలకు నీటి పంపిణీ

వరద నియంత్రణలోనూ ఇక్కట్లే

పట్టించుకోని జలవనరుల శాఖ

బ్రిటిష్‌ కాలం నుంచి సాగునీటి వ్యవస్థలో భాగంగా కాల్వల నిర్వ హణ సాఫీగా సాగేందుకు లస్కర్ల పాత్ర కీలకం. అయితే నాలుగు దశాబ్దాలుగా లస్కర్‌ పోస్టుల ఖాళీ అవుతున్నా.. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. దీంతో సాగునీటి నిల్వల నిర్వ హణలో లోటుపాట్ల వల్ల రైతాంగా నికి సమస్యలు ఎదురవుతున్నాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ డెల్టా గోదావరి కాల్వ కింద ఉభయ గోదావరి జిల్లాలో ఐదు లక్షల ఎకరాల వరకు వరి సాగవుతోంది. ప్రధానంగా డెల్టాకు నిడద వోలులోని విజ్జేశ్వరం, ఏలూరు, నరసాపురం కాల్వల ద్వారా గోదావరి పరివాహాక ప్రాంతా లకు సాగునీరు సరఫరా అవుతుంటుంది. ఇందులో భాగంగా లాక్‌ పాయింట్ల నిర్వహణ కు లస్కర్ల పాత్ర చాలా కీలకం. వర్కుఛార్జుడ్‌ ఉద్యోగులుగానే 400 మంది డెల్టా వ్యవస్థ కింద పనిచేసేవారు. ఇందులో కీలకమైనవి డెల్టా లస్కర్‌, కెనాల్‌ లస్కర్‌గా పోస్టుల వర్గీకరణ జరిగింది. అయితే ఈ స్థానాల్లో రిటైర్‌ అయిన వారి స్థానంలో కొత్తగా రెగ్యులర్‌ లస్కర్ల నియా మకం జరగడం లేదు. 1994 నుంచి ఒక్కరిని కూడా నియమించలేదు. మెయిన్‌ కెనాల్‌ నాలు గు కిలోమీటర్ల పరిధిలో ఒక లస్కర్‌ విధులు నిర్వహణ చేయాల్సి ఉంది. దిగువ ప్రాంతాల్లో ఐదువేల ఎకరాలకు ఆయకట్టుకు లస్కర్‌ విధిగా ఉండాలి.

12 ప్రధాన కాల్వలకు ఇక్కట్లే..

గోదావరి డెల్టాలో ప్రధానంగా ఏలూరు సర్కిల్‌ పరిధిలోనే 12 మెయిన్‌ కెనాల్స్‌ ఉన్నా యి. గోదావరి వెస్ట్రన్‌ మెయిన్‌ కాల్వ, కాకర పర్రు కెనాల్‌, జీఅండ్‌వీ కెనాల్‌, గోదావరి వెస్ట్రన్‌ బ్యాంక్‌ కెనాల్‌, నరసాపురం కెనాల్‌, ఏలూరు, అత్తిలి కెనాల్‌,జంక్షన్‌ కెనాల్‌, వెంక య్య వయ్యేరు కాలనీ, ఓల్డ్‌ వయ్యేరు కెనాల్‌, ఉండి కెనాల్స్‌ ఉన్నాయి. వాస్తవంగా 295 ఒరి జనల్‌ లస్కర్‌ పోస్టులుండాల్సి ఉండగా వర్కు ఛార్జుడ్‌ సిబ్బంది కింద రిక్రూట్‌మెంట్‌ లేకపో వడంతో అధికారులు సాగునీటి కాల్వలు నిర్వ హణలో ఇక్కట్లు ఎదుర్కొంటు న్నారు. కేవలం జిల్లా అంతా మొత్తం రెగ్యులర్‌ లస్కర్లు 38 మంది ఉన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కింద కనీసం 300 లస్కర్‌ పోస్టులను మంజూరు చేయాలని కోరుతుంటే కేవలం 190 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులతోనే సరిపెడుతున్నారు. వాస్తవంగా 12 నెలలకు విధుల్లోకి తీసుకుని కేవలం పది నెలలకే రూ.10,300 వేతనం ఇస్తున్నారు. ఈ వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని, 12 నెలలు కాలానికి నియా మకం చేయాలని కోరుతున్న జలవనరులశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఆప్కాస్‌ కింద వీరి నియామకం చేయాలని కోరుతున్న పదేళ్ల్ల నుంచి అరకొర సిబ్బందే సాగునీటి కాల్వల నిర్వహణ చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా మెయిన్‌ ఇరిగేషన్‌ పరిధిలో మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల 20 మంది కనీసంగా పనిచేయాల్సి ఉంది. ఎర్రకాల్వ, జల్లేరు, తమ్మిలేరు కొవ్వాడ కాల్వల కిందిస్థాయి రెగ్యులర్‌ సిబ్బంది అడపాదడపా వరదలొచ్చినప్పుడు అక్కడ లాకుల నిర్వహణ చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడు ఈ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో లస్కర్ల సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:53 AM