Share News

ఇంకిన భూగర్భజలం!

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:45 AM

భూగర్భ జలాల మట్టాలు ఇంకిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గోదావరి చెంతనే ఉన్న గత నవంబరు నెలాఖరు నాటికి జిల్లా సగటు 16.22 మీటర్లకు నీటి మట్టాలు చేరాయి.

ఇంకిన భూగర్భజలం!
నూజివీడులో ఫ్రీజోమీటరు ద్వారా భూగర్భజలం రీడింగ్‌ తీస్తున్న సిబ్బంది

జిల్లాలో సగటు 16.22 మీటర్లు

కొయ్యలగూడెంలో దారుణంగా 79.78 మీటర్లకు.. ఆందోళనలో యంత్రాంగం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భూగర్భ జలాల మట్టాలు ఇంకిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గోదావరి చెంతనే ఉన్న గత నవంబరు నెలాఖరు నాటికి జిల్లా సగటు 16.22 మీటర్లకు నీటి మట్టాలు చేరాయి. వాస్తవంగా మూడు మీటర్లే లోపు ఈ మట్టం రీడింగ్‌ నమోదు కావాల్సి ఉంది. వర్షపాతం మెరుగ్గా ఉన్న భూగర్భ జలాల పెంపునకు ఏ విధమైన చర్యలు కొంత కాలంగా లేవు. గోదావరి జిల్లాల్లో భూగర్భ జలం అడు గంటడమేమిటి? ఈ పరిస్థితి ఏమిటంటూ సీఎం చంద్ర బాబు నాయుడే కలెక్టర్ల సదస్సులో ఆశ్చర్యం వ్యక్తం చేశా రు.నివేదిక తయారు చేసిన గత కలెక్టర్‌, సీనియర్‌ అధి కారి కాటంనేని భాస్కర్‌ను ఆయన తర్కించి అడిగి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. ఈ అంశంపై భూగర్భజల శాఖను ఆరా తీయగా 16.22 మీటర్లకు నీటి మట్టాలు చేరాయని డిప్యూటీ డైరెక్టర్‌ పైల కోదండరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలి పారు. మట్టాలు పడిపోవడం వల్ల విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

72 చోట్ల ప్రీజోమీటర్లతో లెక్కలు

జిల్లాలో 72 చోట్ల ప్రీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాలు అంశంపై రీడింగ్‌లను అధికారులు నమోదు చేస్తారు. కొన్ని మండలాల్లో ఈ మీటర్లు రెండు నుంచి 4 వరకు ఏర్పాటు చేశారు. ప్రతీ నెల రీడింగ్‌ తీసి ఆ మేరకు జల మట్టాలు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉం ది. వేసవిలో జిల్లాలో 8, వర్షాకాలం లో 3 మీటర్లు సగటు మట్టాలు నమోదు కావాలి. ఈవిధంగా ఉం టేనే వాతావరణంలో సమతుల్యత ఉంటుంది.

మండలాల వారీగా నీటిమట్టాలు

ద్వారకా తిరుమల జి.కొత్తపల్లిలో 74.60 మీటర్లు, కొయ్యలగూడెం 79.78 ముసునూరు 62, లింగపాలెం 41.36 నూజివీడు 40.30 కామవరపుకోట 46.59 పెదవేగిలో 35.59 నమోదు కావడం ఆందోళన రేకెత్తిసున్నాయి.

ప్రత్నామ్నాయ ఏర్పాట్లకు నిధుల కొరత

భూగర్భ జలాలు వృద్ధి చెందాలంటే జిల్లా వ్యాప్తంగా 924 చోట్ల రీచార్జి షాప్ట్‌లను ఏర్పాటు చేసి.. భూమిలోకి బోర్ల ద్వారా నీటిని పంపుతుండాలి. మరోవైపు 1,610 చోట్ల చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటికి నిధులు కొరతే ప్రధానంగా కారణంగా చెబుతున్నారు. రైతుల పొలాల్లోను విరివిగా ఫారమ్‌ పాండ్స్‌ ఏర్పాటు చేసినా భూగర్భజలం కొంతమేర వృద్ధి చెందుతుంది. జిల్లాకు చేరుకున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి భూగర్భజలాలు వృద్ధిపై సమీక్ష జరిపే అవకాశం ఉంది. అధికారులు కూడా దిద్దుబాటు చర్యలకు పూనుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:45 AM