అంతర్ రాష్ట్ర దొంగల ముఠా దొరికింది
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:03 AM
బంగారం తక్కువ ధరకు ఇస్తున్నామని నమ్మించి, తర్వాత వారిని బెదిరించి డబ్బులు దోచుకుపోయే నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): బంగారం తక్కువ ధరకు ఇస్తున్నామని నమ్మించి, తర్వాత వారిని బెదిరించి డబ్బులు దోచుకుపోయే నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ ఎస్సై ఆదిప్రసాద్ ఆదివారం వివరాలు తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన కర్నాటకకు చెందిన ఐదుగురు వ్యక్తులు లాడ్జీల్లో రిజిస్టర్లు పట్టుకుపోయి అందులో నంబర్లకు ఫోన్‌చేసి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెబుతున్నారు. త్వరగా డబ్బులతో వస్తే బంగారం దక్కు తుందని తొందరపెట్టి నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ నకిలీ బంగారం చూపుతున్నారు. బంగారం కోసం వచ్చిన వారు అసలు, నకిలీ చూడాలని అడిగితే కత్తితో బెదిరించి పరారవుతున్నారు. ఫిర్యాదులు అందడంతో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో డీఎస్పీ విశ్వనాథ్ సూచనలతో సీఐ ఆది ప్రసాద్, ఎస్సై నాగరాజు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక చిత్రదుర్గం మండలం కునటేపు గొల్లరబట్టికి చెందిన శరణప్ప గంగప్ప, సండూర్ మండలం త్రిపురకు చెందిన కార్తీక్ ఉమాపతి,ఎన్ శశికుమార్, రుద్రప్ప, గజపుర మండలానికి చెందిన బత్తినపల్లికి చెందిన సతవాడ సందీప్‌లుగా గుర్తించారు. జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న ఐదుగురిని అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.13,500 నగదు, చాకు, కియా కారు, లాడ్జ్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వేగంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ విశ్వనాథ్, సీఐ ఆది ప్రసాద్, ఎస్సైలు నాగరాజు, బాదం శ్రీనును ఎస్పీ అభినందించారు.
ద్వారకాతిరుమలలో ఒకే రోజు మూడు ఇళ్లలో దొంగతనాలు
ద్వారకాతిరుమల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వరుస దొంగతనాలతో ద్వారకాతిరుమల ప్రజలు హడలెత్తిపోయారు. మూడు ఇళ్లలో ఒకేరోజు దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం అర్దరాత్రి వేళ దొంగలు రెచ్చిపోయారు. దాదాపు 12 కాసుల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షలు నగదు అపహరించారు. బాధితులు తెలి పిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు గ్రామానికి చెందిన పోలుబోయిన లక్ష్మణరావు ఇంట్లో ప్రవేశించి మత్తు మందు చల్లారు. బీరు వా పగలుకొట్టి దర్జాగా బంగారు నగలు దోచుకెళ్లారు. దాదాపు పది కాసుల బంగారు నగలు పోయినట్లు ఉదయం గుర్తించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. చెరువు వీధిలో ఉంటున్న కనిగొళ్ల లక్ష్మికాశి విశ్వనాఽథం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో చొరబడి రెండు కాసుల బంగారం, రూ.2.50 లక్షలు నగదు దోచుకెళ్లారు. కాశి అశ్వారావుపేటలోని తన సోద రి ఇంటికి శుభకార్యం నిమిత్తం కుటుంబ సమే తంగా వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి లబోదిబోమన్నా రు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రంథాలయం పక్కరోడ్డులోని పీఎంపీ వైద్యుడు నరం నర సింహరావు ఇంటి ఆవరణలో ఉంచిన పల్సర్ బైక్ అపహరించారు. చోరీ సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. వీటిపై బాధితులు స్థానిక పోలీస్టేషన్‌లో పిర్యాదు చేయగా ఘటనా స్థలాల ను పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.